పాలవ్యాన్లో మద్యం బాటిళ్ళు

పట్టుకున్న ఎక్సయిజ్ సిబ్బంది

లాక్ డౌన్ లో మందుబాబులు మందు కోసం రకరకాల మార్గాలను ఎంచుకుంటున్నారు. ఎక్సయిజ్ పోలీసులు కూడా వీలైనంతవరకు అన్ని మార్గాలను చేధిస్తున్నారు. తాజాగా పాలవ్యాన్ లో తరలిస్తున్న 36 మద్యం బాటిళ్లను గుంటూరు జిల్లాలోని నకరికల్లు మండలం చల్లగుండ్ల అడ్డరోడ్డు వద్ద స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఎక్సైజ్ ఎస్.ఐ జయరావు మాట్లాడుతూ విశ్వసనీయ సమాచారం మేరకు తెలంగాణ నుంచి వస్తున్న పాల వాహనం లో తరలిస్తున్న 36 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ రెవిన్యూ అధికారి యువరాజ్, పంచాయతీ కార్యదర్శి అప్పారావు తదితరులు పాల్గొన్నారు.

Hits: 16

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *