డీబీఎఫ్ ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు
సమ్మిళిత సమాజ రూపశిల్పి అంబేద్కర్
డీబీఎఫ్ వ్యవస్థాపక అధ్యక్షుడు కొరివి వినయకుమార్

గుంటూరు: దళిత బహుజన ఫ్రంట్ (డీబీఎఫ్) ఆధ్వర్యంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 134వ జయంతి వేడుకలు సోమవారం గుంటూరులోని ఆ సంస్థ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు.. ఈ కార్యక్రమంలో ముఖ్య వక్తగా పాల్గొన్న దళిత బహుజన ఫ్రంట్ వ్యవస్థాపక అధ్యక్షుడు కొరివి వినయ్ కుమార్ మాట్లాడుతూ అస్తవ్యస్తమైన భారత సమాజాన్ని శక్తివంతమైన, సమ్మిళిత దేశంగా రూపొందించడంలో డా. అంబేద్కర్ రాజ్యాంగ రచన ద్వారా చేసిన కృషి అమోఘమని కొనియాడారు. భారత రాజ్యాంగం కల్పించిన హక్కుల ద్వారానే అణచివేతకు గురైన ప్రతి ఒక్కరూ నేడు ఆధునిక పౌరులుగా రూపొందారని ఆయన విశ్లేషించారు. రాజ్యాంగ పరిరక్షణను నేటి పౌరుల తక్షణ కర్తవ్యంగా భావించాలని ఆయన పిలుపునిచ్చారు.కార్యక్రమానికి డిబిఎఫ్ జిల్లా అధ్యక్షులు భూపతి సునీల్ కుమార్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా దళిత బహుజన ఉద్యమ నేతలు పొందుగల ప్రకాష్, కోడిరెక్క కోటి రత్నం, చంద్ర నాయక్, వాల్మీకి శ్రీనివాసరావు, ఉప్పలపాటి మునియ్య, శ్రీమతి శ్యామల, షేక్ నాగూర్ బాబు, అందుగుల కుమార్ తదితరులు పాల్గొన్నారు.

