ap news

డిసెంబర్ 2న హిట్ 2 విడుదల… హీరో అడవి శేషు

ఎంతో సాధారణంగా ,  వినోదాత్మకంగా ఉండే పోలీసు అధికారికి సవాల్ గా నిలిచిన హత్య కేసు ను ఎలా చేధించారు అనేది హిట్ 2 చిత్రం అని, ప్రేక్షకులు విజయవంతం చేయాలని హీరో అడవి శేషు కోరారు. డిసెంబర్ 2న హిట్ 2 చిత్రం విడుదల కానున్న  నేపథ్యంలో యూనిట్ సభ్యులు చిత్ర ప్రమోషన్ లో భాగంగా విశాఖపట్టణంలో ఆదివారం సందడి చేశారు. ఈ సందర్భంగా ఓ హోటల్ లో జరిగిన విలేకరుల సమావేశంలో హీరో అడవి శేషు మాట్లాడుతూ చిన్నప్పటి నుండి విశాఖ లో పెరగడంతో.  ఈ నగరం తో అనుబంధం ఏర్పడింది. విశాఖ వాసిగా ఇక్కడ యాసతో ఈ చిత్రం లో పోలీసు అధికారిగా నటించాను. ఎంతో సరదాగా ఉండే పోలీసు అధికారికి తమకు సంబంధించిన వ్యక్తి హత్య కేసు సవాల్ గా నిలుస్తుంది. అది ఎలా చేధించాడు అనేది ఈ చిత్రం అన్నారు.  హీరో నాని నాకు మంచి మిత్రుడు. అలాగే నా ప్రతి చిత్రానికి  సపోర్ట్ చేస్తూ నాకు లక్కీ పర్శన్ గా నిలిచారు. ఈ చిత్రానికి హీరో నాని నిర్మాతగా వ్యవహరించారు. ఓ స్నేహితుడుగా నాకు ఎంతో అండగా నిలిచారు.

హీరోయిన్ మీనాక్షి చౌదరి మాట్లాడుతూ హిట్టు చిత్రంలో నటించిన చాలా ఆనందంగా ఉంది . నా క్యారెక్టర్ కి మంచి గుర్తింపు వస్తుంది . విశాఖలో మూడు నెలలు షూటింగ్ లో పాల్గొన్నాను.  ఇక్కడ అందమైన బీచ్, పక్కనే కొండలు నాకు బాగా నచ్చి ఫేవరెట్ సిటీగా మారింది . చిత్ర రచయిత దర్శకుడు డాక్టర్ శైలేష్ కొలను మాట్లాడుతూ హిట్ 2 చిత్రం విశాఖలో 70 శాతం మూడు నెలలు పాటు షూటింగ్ చేశాం . ఇక్కడ వారు మమ్మల్ని ఎంతో ఆత్మీయంగా చూసుకున్నారు . విశాఖలో షూటింగ్ ముందే ఇక్కడ యాస భాష పై ప్రత్యేకంగా పరిశీలన జరిపాను . అందుకు తగిన విధంగా హీరో క్యారెక్టర్ మలిచాను . డిసెంబర్ 2న హిట్టు చిత్రం విడుదల కానుంది.  ప్రేక్షకులందరూ విజయవంతం చేయాలని కోరుతున్నాను. అనంతరం సాయంత్రం చిత్ర యూనిట్ సభ్యులు సెంటర్లో సందడి చేశారు.

కొత్త అనుభూతినిచ్చిన అన్ స్టాపబుల్

బాలయ్య అన్ స్టాపబుల్ నాకు కొత్త అనుభూతిని ఇచ్చింది… అడవి శేషు.బాలయ్య అన్ స్టాపబుల్ సీజన్ 2 లో నేను, హీరో శర్వానంద్ కలిసి పాల్గొనడం ఎంతో ఆనందంగా ఉంది. బాలయ్య చాలా సీరియస్ గా ఉంటారేమో అని టెన్షన్ గా నేను, శర్వా షోకు వెళ్ళాం.బాలయ్య చాలా సరదాగా వ్యవహరించారు.హోస్ట్ గా బాలయ్య ఎంతో ఫన్ క్రియేట్ చేసి గా మాతో కలిసి పోయిన తీరు గొప్ప అనుభూతి ఇచ్చింది.

Share this News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *