వనభోజనాలు మన సంస్కృతి లో ఒక భాగం
కార్తీక వన భోజనాల్లో పాల్గొన్న సోము వీర్రాజు
కార్తీక మాసంలో వన భోజనాల కు ఒక ప్రాశస్త్యం ఉందని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ సోమువీర్రాజు అన్నారు.ఎన్టీఆర్ జిల్లా బిజెపి కార్తీక వన సమారాధనకోటి దీపోత్సవం కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు మాట్లాడుతూ..బిజెపి కుటుంబ వ్యవస్థ ఆధారంగా పని చేస్తోంది..అదే భారతీయ సాంప్రదాయం..మనదేశంలో సంప్రదాయం పేరుతో కుటుంబ అన్యోన్యంగా జీవన విధానం సాగుతుంది..వినాయక చవితి తో మన పండుగలు ప్రారంభం అవుతాయి..మన జీవితంలో పండుగలు ఒక భాగం..హిందూ త్వం మన జీవన విధానం,మతం కాదు..మనకి భగవంతుళ్ళు.. గ్రంధాలు ఉన్నాయి..మనిషి లో భగవంతుణ్ణి చూస్తాం..అనేక కారణాల వల్ల కొందరు మతం మారారు..భారతీయ క్రైస్తవ లు , ముస్లింలు కూడా పెళ్ళిళ్ళు భారతీయ సాంప్రదాయ లో నిర్వహిస్తున్నారు…కార్తీక మాసం యుగయుగాలుగా నిర్వహిస్తున్నారు.మనజీవన విధానం లో సైన్స్ ఉందన్నారు…బిజెపి జిల్లా అధ్యక్షుడు బబ్బూరి శ్రీ రాం అధ్యక్షత వహించారు.బిజెపి సీనియర్ నేత దాసం ఉమామహేశ్వర రాజు కార్యక్రమం నిర్వహించారు.బిజెపి జిల్లా శాఖ ఆధ్వర్యంలో కార్యక్రమం కొనసాగింది.