ap newsgunturu

బాబు సభ..జనసంద్రమైన పొన్నూరు

గుంటూరు జిల్లా పొన్నూరులో ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో పాల్గొన్న టిడిపి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు

రోడ్ షోలో టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ప్రసంగం:

• ప్రజలు నుంచి అనూహ్య స్పందన కనిపిస్తోంది. ఊళ్లకు ఊళ్లు కదిలి మన కార్యక్రమానికి వస్తున్నారు.
• యువత, మహిళలు, యువతులు సైతం రోడ్డుమీదకు వచ్చి స్వాగతం పలికారు.
• నా జీవితంలో మహిళల్లో ఇంత స్ఫూర్తి ఎప్పుడూ చూడలేదు. మగవారికి పోటీగా మహిళలు తరలివస్తున్నారు.
• నాకు పొన్నూరు కొత్త కాదు…అనేక సార్లు వచ్చాను.
• 7 సార్లు ఇక్కడ టిడిపి గెలిచింది. అలాంటి నియోజకవర్గానికి అనేక సార్లు వచ్చాను.
• నేను సినిమా యాక్టర్ కాదు….నా సినిమా రిలీజ్ కాలేదు…అయినా జనంలో అద్భుత స్పందన ఉంది.
• రాష్ట్రంలో అన్ని రకాలుగా ధరలు పెరిగిపోయాయి…..కరెంట్ చార్జీలు, నిత్యావసర సరుకులు, మద్యం రేట్లు పెరిగాయి…ఇంటి పన్ను పెంచారు.
• చెత్త మీద కూడా పన్ను వేసిన చెత్త సిఎం జగన్ మోహన్ రెడ్డి
• జగన్ రూ.10 పడేసి….అవి మనవే అని చూసుకునే సరికి రూ.10 వేలు కొట్టేస్తున్నాడు.
• జగన్ ఇచ్చేది సంక్షేమం కాదు…తెచ్చింది సంక్షోభం.
• మనం ఇంత మీటింగ్ పెట్టుకుంటే మన మీటింగ్ లో అలజడి సృష్టించేందుకు వైసిపి వాళ్లు ప్రయత్నిస్తున్నారు.
• మరి పోలీసులు ఏం చేస్తున్నారు..? మీ పనితీరుకు అవార్డులు ఇవ్వాలి.
• సైకోలను వదిలేది లేదు…..
• రాష్ట్రంలో అందరికీ ఈ పాలనతో కష్టాలు….అందుకే ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి అని పేరు పెట్టాను.


• 7 సార్లు పొన్నూరులో గెలిచిన కుటుంబం దూళిపాళ్ల కుటుంబం
• జగన్ ఒక అమూల్ బేబీ. జగన్ ఎందుకు అమూల్ ను తెచ్చాడు.?
• అమూల్ డైరీ తెచ్చి…..రాష్ట్ర అస్తులు రాసిఇస్తున్నాడు.
• అమూల్ బేబీ జాగ్రత్త ….మిమ్మల్ని బంగాళా ఖాతంలో కలిపివేస్తా.
• అమూల్ బేబీ సంగం రైతులను దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నాడు.
• జగన్ కు పోలీసులు ఉన్నారు….నాకు 5 కోట్ల ప్రజలు ఉన్నారు.
• నాలుగేళ్ల తరువాత జగన్ రెడ్డికి బిసిలు గుర్తుకొచ్చారు.
• జగన్ వెనుక నలుగురు ఉన్నారు….నిజమే…సజ్జల, సాయిరెడ్డి, పెద్దిరెడ్డి, సుబ్బారెడ్డి ఉన్నారు.
• నాకు కులం లేదు..మతం లేదు….నా కులం పేదరికం. అన్ని కులాలకు నేనే ప్రతినిధి.
• వెనుకబడిన వర్గాలకు న్యాయం చేసిన పార్టీ టిడిపి
• టిడిపి డిఎన్ఎలో వెనుకబడిన తరగతులు ఉన్నారు.
• నీ బాబాయి సుబ్బారెడ్డి తూర్పు గోదావరి వెళితే…బిసి మంత్రి ఆయన కాళ్లు మొక్కాలా.?
• బుధవారం బిసి సభ పేరుతో బస్సులు పెట్టి బలవంతంగా జనాన్ని తరలించారు.
• సభకు రాకపోతే పథకాలు కట్ చేస్తామని బెదిరించారు
• మనం అనుకుంటే జగన్ అధికారం కట్ చేస్తాం….సహాయ నిరాకరణ ప్రారంభించాలి.


• పొన్నూరులో మిమ్మల్ని చూశాక నాకు అనుమానాలు తీరిపోయాయి. రాబోయేది తెలుగుదేశం ప్రభుత్వమే.
• ఈ మీటింగ్ చూసి సైకో జగన్ రెడ్డికి ఇక నిద్ర రాదు. రేపు మంత్రులను పంపి మనల్ని తిట్టిస్తాడు.
• నాడు ముద్దులు పెట్టాడు…..ఇప్పుడు పిడిగుద్దులు గుద్దుతున్నాడు ఈ జగన్ రెడ్డి.
• ఇచ్చేది గోరంత…దోచేది కొండంత.
• అన్న క్యాంటీన్ ఏం తప్పు చేసింది…పేదలకు అన్నం పెట్టే కార్యక్రమం ఎందుకు రద్దు చేశారు..?
• ఎపిలో జలగ రెడ్డి అన్న క్యాంటీన్ తీసివెయ్యడమే కాకుండా మనం పెట్టిన క్యాంటీన్ లను కూడా అడ్డుకుంటున్నాడు
• బిసిలంతా ఇదేం ఖర్మ మన బిసిలకు అంటున్నారు. మనం జయహో బిసి పేరు పెట్టుకున్నాం.
• దాన్ని కాపి కొట్టి జగన్ మీటిండ్ పెట్టుకున్నాడు
• మళ్లీ మన ప్రభుత్వం రాగానే బిసిలకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దుతాము.
• చంద్రన్న భీమా వస్తుందా..? ఎందుకు ఇవ్వడం లేదో గడప గడపకు వచ్చే వైసిపి ఎమ్మెల్యేలను నిలదీయండి.
• సంక్రాంతి కానుక వస్తుందా..?
• నిరుద్యోగులకు జగన్ మటన్ కొట్లో, ఫిష్ మార్ట్ లో ఉద్యోగాలు ఇచ్చాడు
• మనం ఐటి ప్రోత్సహించి మంచి మంచి ఉద్యోగాలు ఇచ్చాం
• ఉన్నత చదువులు చదువుకున్న వారు అంతా బయటకు వెళ్లిపోయారు.
• జగన్ రెడ్డి వచ్చిన తరువాత ఒక్క పరిశ్రమా రాలేదు….ఎపిలో ఉన్న అమరరాజా సంస్థను కూడా పక్క రాష్ట్రానికి తరిమేశారు.
• అమూల్ బేబి జగన్ రెడ్డి పెట్టే కేసులకు నేను భయపడతానా….క్లైమోర్ మైన్స్ కు భయపడని నేను..నీ తప్పుడు కేసులుకు భయపడతానా.?
• దొంగ కేసులు పెట్టేవారిని దొంగలు అనక ఏమంటాం.?
• ధూళిపాళ్ళ నరేంద్రను తప్పుడు కేసుపెట్టి జైలుకు పంపినట్లు అందరినీ జైలుకు పంపాలి అని చూస్తున్నాడు
• దేశంలో ఎక్కువ డ్రగ్స్ పట్టుబడిన రాష్ట్రం ఎపి.
• దేశంలో ఎక్కువ సిబిఐ కేసులు ఉన్న రాష్ట్రం ఎపి…జగన్ రెడ్డి దీనికి సిగ్గుపడాలి.
• డిల్లీ లిక్కర్ స్కాం రాగానే….సాయిరెడ్డి ఫోన్ మిస్ అయ్యింది.
• పోలీసులు సాయిరెడ్డి ఫోన్ వెతికి పెట్టాలి.
• 40 ఏళ్లలో ఎక్కడా తప్పు చెయ్యకుండా పాలించిన పార్టీ టిడిపి.
• సొంత బాబాయిని చంపిన జగన్ రెడ్డి నిన్ను నన్ను లెక్కపెడతాడా.?
• వివేకాది గుండెపోటు అన్నాడు….నేను చంపాను అన్నాడు.
• సునీతా రెడ్డి పోరాటంతో కేసు పక్క రాష్ట్రానికి బదిలీ అయ్యింది
• ఒకప్పుడు జగనన్న బాణం షర్మిల విషయంలో ఇప్పుడు జగన్ మాట్లాడలేని పరిస్థితి.
• షర్మిల అరెస్టుపై ఎందుకు మాట్లాడలేదు అని స్వయంగా ప్రధాని జగన్ ను అడగారు.
• ఎస్సిలకు చెందిన 28 కార్యక్రమాలు రద్దు చేశాడు.
• 39 టీడీపీ వారిని హత్య చేస్తే అందులో 26 మంది బిసిలే ఉన్నారు.
• ఒక ఎస్సి డ్రైవర్ ను చంపి వైసిపి ఎమ్మెల్సీ డెడ్ బాడీ ఇంటికి పంపాడు.
• మైనారిటీలకు ఇచ్చే పెళ్లి కానుకపోయింది…రంజాన్ తోఫా పోయింది.
• జగన్ బటన్ నొక్కితే ఇసుక డబ్బు, మైనింగ్ డబ్బు, ల్యాండ్ డబ్బు ఇంటికి చేరుతోంది.
• పొన్నూరు ఎమ్మెల్యే కిలాడి రోశయ్య….ఆయన చిట్టా కూడా బయటపెడతాము.
• ఎవరినీ వదిలిపెట్టను ఉతికి ఆరేస్తాను.
• దేశంలో ఎక్కడైనా మూడు రాజధానులు ఉన్నాయా.?
• పట్టిసీమ కట్టి ఈ ప్రాంతానికి నీటి కొరత లేకుండా చేశాను.
• 72 శాతం పూర్తి చేసిన పొలవరాన్ని నాశనం చేశారు
• రాష్ట్రంలో జగన్…..పొన్నూరులో ఈ ఎమ్మెల్యే అన్ని రివర్స్ చేశారు.
• పట్టణంలో రూ.175 కోట్లతో 2368 టిడ్కో ఇళ్లు కట్టాం. 85 శాతం పూర్తి అయిన వాటిని అలాగే వదిలేశారు. లబ్దిదారులకు ఇవ్వలేదు.
• నియోజకవర్గంలో చేపట్టిన ఎన్టీఆర్ హౌసింగ్ స్కీం బిల్లులు చెల్లించలేదు.
• గుంటూరు చానెల్ అభివృద్దికి రూ.325 కోట్లు ఇచ్చాం. ఆ పనులు ఆపేశారు.
• గుంటూరు – బాపట్ల రోడ్ లో కొమ్మమూరు సాగునీటి కాలువపై కొత్త వంతెనకు రూ.30 కోట్లు నిధులు ఇస్తే దాన్నీ నిర్మించలేదు.
• పొన్నూరును ఎమ్మెల్యే మట్టి, కంకర, భూములు, బార్లు, వెంచర్లు..చివరికి బ్లీచింగ్ కొనుగోళ్లలో కూడా అక్రమాలు చేస్తున్నాడు
• పొన్నూరు నియోజకవర్గం అంటేనే అధికారులు హడలిపోతున్నారు…ఇప్పటికే 30 మందిని సస్పెండ్ చేయించాడు. మరో అధికారి సెలవులో వెళ్లిపోయాడు.
• అక్రమాలకు సహకరించకపోతే అధికారులపై ఒత్తిళ్లు…వేధింపులు చేస్తున్నాడు.
• చేబ్రోలు పరిసర ప్రాంతాల్లో భారీ ఎత్తున గ్రావెల్ అక్రమ మైనింగ్. ఎకరానికి రూ.30 లక్షల ఇవ్వాలి…లేదంటే తవ్వకాల్లో భాగస్వామ్యం ఇవ్వాల్సిందే. ఇదీ కిలాడి ఎమ్మెల్యే తీరు.
• ఎక్కడ లే అవుట్ వేసినా ఎకరానికి రూ.10 లక్షలు కప్పం ఎమ్మెల్యేకి కట్టాల్సిందే.
• ఇటీవల ఇచ్చిన బార్ లైసెన్స్ లకు రూ.20 లక్షల చొప్పున వసూలు.
• రేషన్ బియ్యం మాఫియాకు అడ్డాగా పొన్నూరు ను మార్చిన ఘనుడు ఈ వైసీపీ ఎమ్మెల్యే. రేషన్ మాఫియా నుంచి నెలకు రూ.10 లక్షల ముడుపులు తీసుకుంటున్నాడు.

Share this News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *