ap news

రాయలసీమ ఎత్తిపోతలకు అనుమతులివ్వండి

కేంద్ర అటవీ పర్యావరణశాఖ మంత్రి భూపేంద్ర యాదవ్‌తో ఏపీ సీఎం వై.ఎస్‌ జగన్‌ భేటీ

ఇరిగేషన్‌ ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతులు మంజూరుతో పాటు ఆంధ్రప్రదేశ్‌ అభవృద్ధికి సంబంధించిన పలు అంశాలపై కేంద్రమంత్రికి విన్నవించిన సీఎం.

రాయలసీమ లిఫ్ట్‌ ఇరిగేషన్‌ స్కీం…:
– రాయలసీమ లిఫ్ట్‌ఇరిగేషన్‌ స్కీంకు సంబంధించి పర్యావరణ అనుమతులు మంజూరు చేయాలని కేంద్రమంత్రిని కోరిన సీఎం.
– కరవుతో అల్లాడే ఈప్రాంతానికి తాగునీరు సాగునీరు అందించడానికి ఈ పథకం అత్యంత కీలకమైనది వివరించిన సీఎం.
– రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న శ్రీశైలం, నాగార్జున సాగర్‌రిజర్వాయర్లకు సంబం«ధించి పలు అంశాలను వివరించిన సీఎం.
– కృష్ణానదిపై ఉన్న ఉమ్మడి జలాశయాలైన శ్రీశైలం, నాగార్జున సాగర్‌ ప్రాజెక్టులలో తెలంగాణ ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తోందని, కృష్ణా రివర్‌ మేనేజిమెంట్‌ బోర్డు యొక్క అన్ని ఆపరేషనల్‌ ప్రోటోకాల్స్‌ను, ఒప్పందాలను, ఆదేశాలను ఉల్లంఘిస్తోందని పేర్కొన్న సీఎం.
– ఫలితంగా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం తనకు కృష్ణా నదిపై తనకున్న వాటా హక్కులను కోల్పోవాల్సి వస్తోందని తెలిపిన సీఎం.
– 2022–22, 2022–23 సంవత్సరాలలో తెలంగాణా రాష్ట్రం– సీజన్‌ ప్రారంభమైన తొలిరోజు నుంచి అంటే జూన్‌ 1తేదీ నుంచే… విద్యుత్‌ ఉత్పత్తి కోసం నీటిని వినియోగించడం ప్రారంభించిందని వివరించిన సీఎం.

కేంద్ర అటవీ పర్యావరణశాఖ మంత్రి భూపేంద్ర యాదవ్‌తో పుష్ఫగుచ్ఛం అందిస్తున్న సీఎం జగన్

– శ్రీశైలం జలాశయంలో కనీస నీటి స్ధాయి 834 అడుగులు కంటే తక్కువగా ఉన్నప్పటికీ… తెలంగాణా ప్రభుత్వం విద్యుత్‌ ఉత్పత్తికి నీటి విడుదల చేయడంతో పాటు ..కృష్ణా రివర్‌ మేనేజిమెంట్‌ బోర్డు (కేఆర్‌ఎంబీ) ముందు కనీసం ఎలాంటి ఇండెంట్‌ కూడా లేకుండానే…. ఏకపక్షంగా నాగార్జున సాగర్, కృష్టా డెల్టాకు అవసరం లేనప్పటికీ నీటి విడుదల చేసిందని తెలిపిన సీఎం.
– నీటి పారుదల అవసరాలకు విద్యుత్‌ ఉత్పత్తి అన్నది కేవలం యాధృచ్చికంగా మాత్రమే ఉంటుందనే విషయాన్ని స్పష్టంచేసిన సీఎం.
– విద్యుత్‌ ఉత్పత్తి కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రతీ ఏటా 796 అడుగుల వరకు నీటిని దిగువకు విడుదల చేయడం వల్ల… శ్రీశైలం రిజర్వాయరులో కనీస నీటి మట్టం నిర్వహణకు సహకరించడం లేదు. దీనివల్ల ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఎదుర్కొంటున్న ఇబ్బందిని నేను గతంలోనే కేంద్రం దృష్టికి తీసుకువచ్చానని ప్రస్తావించిన ముఖ్యమంత్రి.

– శ్రీశైలంలో జలాశయంలో నీటిమట్టం 881 అడుగులకు చేరుకుంటే తప్ప… పోతిరెడ్డిపాడునుంచి పూర్తిస్థాయిలో నీటి విడుదల సాధ్యంకాదని వివరించిన సీఎం.
– పోతిరెడ్డి పాడు నుంచి కరువు పీడిత రాయలసీమ సాగు, తాగునీటి అవసరాలతో పాటు, శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు, చెన్నై మహానగరానికి తాగు నీరు అందించడం సాధ్యం కాదని తెలిపిన సీఎం.

– అంతే కాకుండా తెలంగాణ ప్రభుత్వం అనధికారకంగా, ఎటువంటి పర్యావరణ అనుమతులు లేకుండానే పెద్ద ఎత్తున నిర్మిస్తున్న పాలుమూరు– రంగారెడ్డి ఎత్తిపోతల పథకం(3టీఎంసీలు), దిండి పథకాలను 800 అడుగులు వద్ద నిర్మిస్తున్న విషయం ఇదివరకే కేంద్రం దృష్టికి తీసుకు వచ్చామని తెలిపిన సీఎం.
– ఈ ప్రాజెక్టుల వలన రిజర్వాయరు నీటి మట్టం 854 అడుగుల కంటే పైన నిర్వహించడం సాధ్యం కాదని, మరోవైపు ఆంధ్ర ప్రదేశ్‌ ప్రభుత్వానికి కేటాయించిన నీటిని వాడుకోవడానికి కూడా సాధ్యపడదని వెల్లడించిన ముఖ్యమంత్రి.
– ఈ పరిస్థితుల నేపధ్యంలో…. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి రాయలసీమ లిఫ్ట్‌ ఇరిగేషన్‌ స్కీం(ఆర్‌ఎల్‌ఎస్‌)ను అమలు చేయడం మినహా మరో ప్రత్యామ్నాయం లేదని, దీనిద్వారా రోజుకు 3 టీఎంసీల నీటిని టీజీపీ, ఎస్‌ఆర్‌బీసీ, జీఎన్‌ఎస్‌ఎస్‌లకు సరఫరా చేయగలుగుతామన్న ముఖ్యమంత్రి.
తెలంగాణా ప్రభుత్వం నిబంధనలు మరియు ప్రోటోకాల్స్‌ను పూర్తిగా విస్మరించి నీటిని విడుదల చేయడంతో అనుసరిస్తున్న అనుచిత వైఖరిని దృష్టిలో పెట్టుకుని.. రాయలసీమ లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టును సాధ్యమైనంత వేగంగా పూర్తి చేయడం ద్వారా ఆంధ్రప్రదేశ్‌ ప్రయోజనాలను మరింత ప్రమాదంలో పడకుండా నివారించవచ్చునని, అంతకుమించి ఒక్క ఎకరా అదనపు ఆయుకట్టు కల్పించడంతో పాటు, ఒక్క చుక్క అదనపు నీటి నిల్వను కూడా పెంచడం లేదన్న విషయాన్ని కేంద్రమంత్రికి వివరించిన సీఎం.


– ఈ ప్రాజెక్టుకు సంబంధించి పర్యావరణ అనుమతులు మంజూరు కోసం కేంద్ర అటవీ పర్యావరణశాఖకు దరఖాస్తు చేశామని, దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం మరియు అటవీపర్యావరణ శాఖ అధికారులకు మధ్య సమగ్ర చర్చలు జరిగాయి. అందుకు అవసరమైన మొత్తం సమాచారం కూడా ఇప్పటికే అందించామని, ఈ ప్రాజెక్టు కోసం భూసేకరణ, అటవీ ప్రాంతం, వన్యప్రాణుల అభయారణ్యాల ప్రమేయం లేదని, మరియు ప్రాజెక్టు ఎకో సెన్సిటివ్‌ జోన్‌(ఈఎస్‌జెడ్‌) నుంచి 10 కిలోమీటర్ల దూరంలో ఉండడంతో పాటు ఇది కూడా కేవలం ప్రధాన కాలువకు పూర్తి స్ధాయిలో నీటిని అందించడం కోసమేనంటూ కేంద్రమంత్రికి వివరాలు అందించిన సీఎం.
వీలైనంత త్వరలో రాయలసీమ లిప్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు త్వరగా వచ్చేలా చూడాలని విజ్ఞప్తిచేసిన ముఖ్యమంత్రి.

పోర్ట్స్‌:
‘‘ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రం 974 కిలోమీటర్ల విస్తారమైన తీరప్రాంతంతో అపారమైన ఆర్ధిక కార్యకలాపాలకు అనువుగా ఉంది. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం రామాయపట్నం, మచిలీపట్నం, భావనపాడులలో మూడు గ్రీన్‌ ఫీల్డ్‌ పోర్టులను అభివృద్ధి చేస్తోంది. దీంతో పాటు తీరప్రాంతంలో సుమారు 10 లక్షల మత్స్యకారుల కుటుంబాలు జీవనోపాధిగా చేపలపట్టడంతో పాటు, మత్స్య అనుబంద కార్యకలాపాలపై ఆధాపడి ఉన్నారు. ఈ బలహీన వర్గాలను ఆదుకోవడానికి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం 9 వ్యూహాత్మక ప్రదేశాలలో ఫిషింగ్‌ హార్భర్‌ల అభివృద్ధికి ప్రాధాన్యత నిచ్చింది.
రామాయపట్నం ఓడరేవుకు సంబంధించిన పనులు శరవేగంగా జరుగుతున్నాయి. మార్చి, 2024 నాటికి పోర్ట్‌ కార్యకలాపాలు కూడా ప్రారంభం కానున్నాయి.
మిగిలిన రెండు పోర్టుల కోసం కృష్ణా జిల్లాలోని మచిలీపట్నం, శ్రీకాకుళం జిల్లాలోని భావనపాడు పోర్ట్‌లలో పర్యావరణ అనుమతులు మంజూరు కోసం దరఖాస్తు చేశాం. ఇందుకు అవసరమైన సమచారాన్ని కూడా అందజేశాం. ఈ పనులను ఏపీ ప్రభుత్వం వీలైనంత వేగంగా ప్రారంభించేందుకు వీలుగా అవసరమైన అనుమతులు మంజూరుకు మీ సహకారం అందించాలని కోరుతున్నాం.’’ అని కేంద్రమంత్రిని కోరిన సీఎం.

పంప్డు స్టోరేజీ ప్రాజెక్టులు.
పునరుత్పాదక ఇంధన ఉత్పత్తి, గ్రీన్‌ హైడ్రోజన్‌ ఉత్పత్తి మరియు నిల్వలను ప్రోత్సహించడానికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీగారి విజన్‌కు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అనేక కార్యక్రమాలను చేపట్టంది. 2070 నాటికి నిర్దేశించుకున్న నెట్‌ జీరో 2070 లక్ష్య సాధనకు ఇది ఉపయోగపడుతుందంటూ వివరించిన సీఎం.

పంప్డ్‌ స్టోరేజ్‌ సౌకర్యాలను ఏర్పాటు చేయడానికి అనుకూలమైన స్ధలాలను గుర్తించడంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ముందంజలో ఉందని, అదే విధంగా పంప్డ్‌ స్టోరేజీ ప్రాజెక్టుల ప్రమోషన్‌ కోసం పాలసీని కూడా రూపొందించిందని, ఆ తరహా ప్రాజెక్టులలో ఎర్రవరం, కురికుట్టి, సోమశిల, అవుకు వంటి చోట్ల ఏర్పాటు జరుగుతోందని, ఆ ప్రాజెక్టులకు అనుమతులు ఇవ్వాలనికోరిన సీఎం.

వైఎస్‌ఆర్‌ జిల్లా గండికొట వద్ద 1000 మెగావాట్స్‌ పంప్డు స్టోరేజీ ప్రాజెక్టు పర్యావరణ అనుమతులు కోసం ఏపీ ప్రభుత్వం ఇప్పటికే కేంద్ర అటవీ పర్యావరణ శాఖకు ప్రతిపాదన పంపించింది. ఇతర ప్రాజెక్టులకు సంబంధించిన దరఖాస్తులు కూడా సకాలంలో ప్రభుత్వానికి సమర్పించనున్నామని వెల్లడించిన సీఎం. వీటితో పాటు ఏపీ ప్రభుత్వం లోయర్‌ సీలేరు హైడ్రో పవర్‌ ప్రాజెక్టు (230 మెగావాట్లు), అప్పర్‌ సీలేరు పంప్డ్‌ స్టోరేజీ పవర్‌ ప్రాజెక్టు(1350 మెగావాట్లు) సామర్ధ్యంతో చేపడుతోందని, వీటికి సంబంధించిన పర్యావరణ అనుమతులు కోసం దరఖాస్తు చేశామని, రాష్ట్ర ప్రగతికి అవసరమైన ఈ ప్రాజెక్టులకు అనుమతులు మంజూరు చేయాలంటూ అభ్యర్థించిన ముఖ్యమంత్రి.

Share this News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *