చట్టబద్దపాలన అమలుకు న్యాయవ్యవస్థ కృషి
కడప జిల్లా న్యాయమూర్తి ఇంతియాజ్
దళిత స్త్రీ శక్తి ఆధ్యర్యంలో
రూల్ ఆఫ్ లా – కానిస్టిట్యూషన్’పై గుంటూరులో సదస్సు
దేశంలో చట్టబద్ద పాలన అమలయ్యేందుకు న్యాయవ్యవస్థ సమర్ధవంతంగా పనిచేస్తుందని కడప జిల్లా న్యాయమూర్తి ఇంతియాజ్ అన్నారు. రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని జండర్ ప్రచారోద్యమంలో భాగంగా దళిత స్త్రీ శక్తి ఆధ్వర్యంలో గుంటూరులోని ఏసీ లా కాలేజీలో సోమవారం ‘రూల్ ఆఫ్ లా – కానిస్టిట్యూషన్’ అనే అంశంపై నిర్వహించిన సదస్సులో ఇంతియాజ్ పాల్గొని ప్రసంగించారు. ప్రత్యేక చట్టాలను ప్రజలు చైతన్యవంతంగా అర్ధం చేసుకుని ఉపయోగించుకోవాలన్నారు. మాజీ మంత్రి, శాసనమండలి సభ్యుడు డొక్కా మాణిక్య వరప్రసాద్ మాట్లాడుతూ చట్టబద్ధ పాలన వల్లనే నాగరిక సమాజం అభివృద్ధి చెందుతుందన్నారు. పాలన రాజ్యాంగబద్ధంగా లేకపోతే సమాజం అధోగతి పాలవుతుందన్నారు. జైళ్ళలో మగ్గుతున్న అత్యధిలకులు ఎస్సీ, ఎస్టీ, బీసీలేనని తెలిపారు. ఏసీ కాలేజీ కరస్పాండెంట్ ఎలీషా మాట్లాడుతూ మనుషులందరూ సమానత్వమనే భావన లేకపోతే దేశం అభివృద్ధి చెందన్నారు. అధ్యక్షోపన్యాసంలో ఝాన్సీ జెండర్ ఫ్రచారోద్యం గురించి వివరించారు. అంతర్జాతీయంగా నిర్వహిస్తున్న ప్రచారోద్యమంలో భాగంగా దళిత, ఆదివాసీ, స్త్రీ, బాలికపై హింసకు వ్యతిరేకంగా నవంబర్ 25 నుంచి డిసెంబరు 10 వరకు రెండు రాష్ట్రాల్లో ప్రచారోద్యమం నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఈ సదస్సులో ఏసీ లా కాలేజీ ప్రిన్సిపల్ అమృత వర్షిణి, నాగార్జున యూనివర్శిటీ లా అసోసియేట్ ప్రాఫెసర్ సతీష్, అమలకుమారి తదతరులు పాల్గొన్నారు.