ఒంగోలులో 6న బహుజన పార్టీల సమాఖ్య సమావేశం

ఒంగోలులోని ప్రెస్ క్లబ్ లో ఈనెల 6న మంగళవారం ఉదయం 10 గంటలకు ప్రకాశం జిల్లా బహుజన పార్టీల సమాఖ్య సమావేశం నిర్వహించనున్నట్టు సమాఖ్య రాష్ట్ర కన్వీనర్ నాగేశ్వరరావు తెలిపారు. జాతీయ, రాష్ట్ర రాజకీయాల పరిణామాలను చర్చించి దళిత బహుజనులు అనుసరించాల్సిన వైఖరిపై దిశా నిర్దేశం చేసే ఈ సమావేశానికి ముఖ్య కార్యకర్తలంతా హాజరు కావాలని ఆయన కోరారు.