ప్రధాని మోడీతో పవన్ భేటీ
ప్రధాన మంత్రి నరేంద్రమోడీతో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఢిల్లీలో భేటీ అయ్యారు. రాష్ట్రాభివృద్ధికి సంబంధించిన ముఖ్యమైన అంశాలను ప్రధానమంత్రి దృష్టికి పవన్ కళ్యాన్ తీసుకెళ్ళినట్టు సమాచారం. మహారాష్ట్ర ఎన్నికల ఫలితాల అనంతరం పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటనకు వెళ్లటం ప్రాధాన్యత సంతరించుకుంది. మహారాష్ట్రలో ఎన్డీఏ కూటమి తరపున పవన్ కళ్యాణ్ ప్రచారం చేశారు. ఆయన ప్రచారం చేసిన నియోజకవర్గాల్లో ఎన్డీఏ అభ్యర్ధులు ఘన విజయం సాధించారు. ఈ సందర్భంగా ఢిల్లీ పెద్దలు పవన్ ను ప్రశంసలతో ముంచెత్తినట్టు సమాచారం