Breaking News

రాజధాని విషయంలో కేంద్రం జోక్యం చేసుకోదు

బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు

న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్‌ రాజధాని విషయంలో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోదని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు స్పష్టం చేశారు. దేశంలో అనేక చోట్ల రాజధానులు ఏర్పాటు చేస్తున్నారని, రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంలో కేంద్రం ఎప్పుడూ జోక్యం చేసుకోలేదని గుర్తుచేశారు. రాజధాని పేరుతో సింగపూరు, జపాన్, చైనా అంటూ గత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజలను మభ్యపెడుతూ.. కథలు చెప్పారని విమర్శించారు. చంద్రబాబు మాటలపై కేంద్రం ఎటువంటి అభ్యంతరం చెప్పలేదని, ఇప్పుడు కూడా మూడు రాజధానిలో విషయంలోనూ అదే వైఖరితో ఉన్నామని తేల్చిచెప్పారు. అయితే రాజధాని రైతులకు న్యాయం జరగాలన్న తమ నినాదానికి చివరి వరకు కట్టుబడి ఉంటామని పేర్కొన్నారు. గురువారం ఢిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సోము వీర్రాజు మాట్లాడుతూ.. రాజధానిపై టీడీపీ నేతలు బీజేపీని ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్ర రాజకీయాల్లో ఇక తాము సీరియస్‌గా ఉండబోతున్నామని తెలిపారు. బీజేపీ నేతలు తనకు దగ్గరవుతున్నారంటూ చంద్రబాబు నాయుడు సంకేతాలు ఇస్తున్నారని, ఇదంతా ఆయన ఆడే రాజకీయ చదరంగమని వ్యాఖ్యానించారు. అయితే ఈ ఆటలో తాము సైతం కొత్త ఎత్తుగడలు వేస్తామని పేర్కొన్నారు. బీజేపీ-జనసేనకు 20 శాతం ఓటు బ్యాంకు ఉన్నట్లు తాము భావిస్తున్నామని సోము వీర్రాజు చెప్పారు.
ఈ సమావేశంలో రాజ్యసభ సభ్యులు ఙివిల్ నరసింహారావు గారు,ఆంధ్రప్రదేశ్ సహా ఇంచార్జి సునీల్ దియోదర్ గారు పాల్గొని ప్రసంగించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *