Breaking News

కరోనా.. వైద్యుల సలహాలు

ఏపీ కోవిడ్ 19  : కమాండ్ కంట్రోల్
==================

ఆస్ట్రేలియా, ఇండియా, ఇజ్రాయెల్, ఇటలీ, న్యూయార్క్‌లోని కరోనా మహమ్మారిపై ముందు వరసలో నిలబడి పోరాడిన వైద్యుల నుండి సేకరించబడిన సమిష్టి అభిప్రాయాలు.

కోవిడ్ మహమ్మారితో సమయం గడిచే కొద్దీ 3 నెలల ముందు సోకిన వారి కంటే అనగా ఫిబ్రవరి 2020 న వ్యాధికి గురైన వారితో పోల్చుకుంటే 2020 జూలై నుండి తరువాత వ్యాధి బారిన పడే వారికి మనుగడకు ఎక్కువ శాతం అవకాశం ఉంది అని చెప్పారు. దీనికి ముఖ్య కారణం వైద్యులు మరియు శాస్త్రవేత్తలు కోవిడ్ -19 గురించి మరింత తెలుసుకోవడమే.

 • 3 నెలల క్రితం కంటే ప్రస్తుత రోగులకు మెరుగైన చికిత్స చేయగలుగుతున్నారు.
 • సరైన అవగాహన కోసం 2020 ఫిబ్రవరిలో కోవిడ్ గురించి తెలియని 5 ముఖ్యమైన విషయాలను మొదట్లో కోవిడ్ -19 అనేది ఊపిరితిత్తులను న్యుమోనియా కి గురిచేసి తద్వారా మరణాలకు కారణమవుతుందని భావించాము. అందువల్ల ఊపిరి పీల్చుకోలేని అనారోగ్య రోగులకు చికిత్స చేయడానికి వెంటిలేటర్ లు ఉత్తమ మార్గంగా భావించారు.
 • ఇప్పుడు, వైరస్ ఊపిరితిత్తుల మరియు శరీరంలోని ఇతర భాగాల రక్త నాళాలలో రక్తం గడ్డ కట్టడం వలన రక్తం లో ఆక్సిజన్ శాతం తగ్గడానికి కారణమవుతుందని గ్రహిస్తున్నారు
 • ప్రస్తుతం ఈ దశలో రోగులకు వెంటిలేటర్ ల ద్వారా ఆక్సిజన్ అందించడం వలన పెద్ద ఉపయోగం ఉండదని మొదట ఊపిరితిత్తుల రక్త నాళాలలో ఏర్పడిన సూక్ష్మ రక్తపు గడ్డలను నిరోధించి కరిగించాలని అర్దం అయింది.
 • అందువల్ల జూన్ 2020 నుండి చికిత్స నియమావళి ప్రోటోకాల్‌ లో భాగం గా ఆస్పిరిన్ మరియు హెపారిన్ (గడ్డ కట్టడాన్ని నిరోధించే బ్లడ్ టిన్నర్స్) వంటి మందులను ఉపయోగిస్తున్నారు.
 • గతంలో రోగులు వారి రక్త-ఆక్సిజన్ సంతృప్తిలో ఆక్సిజన్ తగ్గడం వల్ల రోడ్డు మీద లేదా ఆసుపత్రికి చేరే లోపు చనిపోయేవారు. దీనికి కారణం హ్యాపీ హైపోక్సియా (happy hypoxia)అని చెప్పవచ్చు.
 • కోవిడ్ -19 రోగులకు కొన్ని సార్లు రక్తం లో ఆక్సిజన్ సంతృప్తత అనేది క్రమంగా 70% కంటే తక్కువగా తగ్గుతున్నప్పటికీ క్లిష్టపరిస్థితికి రోగి వచ్చే వరకు అతనికి ఎటువంటి లక్షణాలు లేవు. సాధారణంగా మనలో రక్తం లో ఆక్సిజన్ సంతృప్తత శాతం 90% కంటే తక్కువగా ఉంటే మనకు ఊపిరి అందని భావం కలుగుతుంది. కోవిడ్ రోగులలో శ్వాస తీసుకోకపోవడం అనేది ప్రేరేపించబడదు, అందువల్ల ఫిబ్రవరి 2020 లో అనారోగ్య రోగులను ఆస్పత్రులలో చాలా ఆలస్యంగా తీసుకున్నారు
 • ఇప్పుడు హ్యాపీ హైపోక్సియా (happy hypoxia) గురించి తెలిసి న రోజు నుండి, సాధారణంగా ఇంటి వద్ద తేలికగా వాడగల రక్తంలో ఆక్సిజన్ శాతం కొలిచే పల్స్ ఆక్సిమీటర్ ఉన్న అన్ని కోవిడ్ రోగుల ఆక్సిజన్ సంతృప్తి శాతం ని పర్యవేక్షిస్తున్నారు.
 • మరియు ఒకవేళ వారి ఆక్సిజన్ సంతృప్తత 93% లేదా అంతకంటే తక్కువకు పడిపోతే వారిని వెంటనే ఆసుపత్రికి తీసుకుని వస్తున్నారు ఈ విధానం రక్తంలో ఆక్సిజన్ లోపాన్ని సరిచేయడానికి వైద్యులకు సరైన సమయం ఇచ్చింది మరియు జూలై 2020 లో కోవిడ్ వ్యక్తులు వ్యాధి విముక్తి కి మనుగడకు మెరుగైన అవకాశాలు ఇచ్చింది.
 • ఫిబ్రవరి 2020 లో కరోనా వైరస్‌తో పోరాడటానికి సరైన మందులు లేవు. దాని హైపోక్సియా వల్ల కలిగే సమస్యలకు మాత్రమే చికిత్స చేశారు. అందువల్ల చాలా మంది రోగులు తీవ్రంగా వ్యాధి బారిన పడ్డారు. ఇప్పుడు ప్రస్తుతం మన దగ్గర 2 ముఖ్యమైన మందులు ఉన్నాయి అవి * ఫావిపిరవిర్ & రెమ్‌డెసివిర్ *. కరోనా వైరస్‌ను చంపగల యాంటీ వైరల్ మందులు ఇవి. ఈ రెండు ఔషధాలను ఉపయోగించడం ద్వారా రోగులు తీవ్రంగా వ్యాధి బారిన పడకుండా నిరోధించవచ్చు మరియు వారు హైపోక్సియాకు వెళ్ళే ముందే దానిని నయం చేయవచ్చు. ఈ పరిజ్ఞానం మనకు జూలై 2020 లో అందుబాటులో ఉంది కానీ ఫిబ్రవరి 2020 లో లేదు.4. కోవిడ్ -19 రోగులు వైరస్ కారణంగానే కాకుండా, రోగుల లోని కలిగి ఉన్న రోగనిరోధక వ్యవస్థ అతిశయోక్తి పద్ధతిలో స్పందిస్తూ విడుదల చేసిన ‘ సైటోకిన్ కణాలు (Cytokine Storm)’ కూడా కారణం అయింది. ఈ రోగనిరోధక వ్యవస్థ బలమైన ప్రతిస్పందన వలన విడుదల అయిన ‘సైటోకిన్ కణాల తుఫాను వైరస్‌ను చంపడమే కాకుండా , రోగులను సైతం కూడా చంపింది. ఫిబ్రవరి 2020 లో ఈ ‘సైటోకిన్ కణాల తుఫాను జరగకుండా ఎలా నిరోధించాలో తెలియదు. ఇప్పుడు జూలై 2020 లో, సులభంగా లభించే స్టెరాయిడ్స్ అని పిలువబడే మందులు ప్రపంచవ్యాప్తంగా ఉన్న వైద్యులు కొంతమంది రోగులలో సైటోకిన్ తుఫానును నివారించడానికి దాదాపు 80 సంవత్సరాలుగా ఉపయోగిస్తున్నారని, ఉపయోగించవచ్చని తెలిసింది.
 • 5. హైపోక్సియా ఉన్నవారిని వారి కడుపుపై ​​పడుకునేలా చేయడం ద్వారా అనగా ప్రోన్ పొజీషన్ లో వారిని పడుకోబెట్టడం ద్వారా మంచిగా మారారని ఇప్పుడు మనం తెలుసుకున్నారు. అంతే కాకుండా కొద్ది రోజుల క్రితం ఇజ్రాయెల్ శాస్త్రవేత్తలు రోగులు ఉత్పత్తి చేసే ఆల్ఫా డిఫెన్సిన్(alpha defensin ) అనే రసాయనాన్ని కనుగొన్నారు. అయితే ఈ ఆల్ఫా డిఫెన్సిన్(alpha defensin ) అనే రసాయనం ఊపిరితిత్తుల లోని రక్తనాళాలలో రక్త కణాలు సూక్ష్మంగా గడ్డ కట్టడానికి కారణమవుతుంది.
 • ప్రస్తుతం దీనిని దశాబ్దాలు గా గౌట్ చికిత్సలో వాడబడుతున్న కొల్చిసిన్(colchicine) అనే ఔషధం ద్వారా దీనిని నివారిస్తున్నారు.కాబట్టి 2020 ఫిబ్రవరిలో కంటే జూలై 2020 లో కోవిడ్ -19 సంక్రమణ నుండి బయటపడటానికి రోగులకు మంచి అవకాశం ఉందని ఇప్పుడు మనకు ఖచ్చితంగా అర్థమవుతుంది.
 • లాక్ డౌన్ కారణంగా భారతదేశం మార్చి లేదా ఏప్రిల్‌లో కోవిడ్ కేసులలో సంఖ్య పరంగా గరిష్ట స్థాయికి చేరుకోలేదు. ఈ వ్యూహం భారతదేశంలో కోవిడ్ -19 మహమ్మారిని కీలకమైన 3 నెలలకు వాయిదా వేసింది, ఇది వేలాది మంది ప్రాణాలను కాపాడటానికి ఒక విధంగా సహాయపడింది.
 • ముందుకు వెళితే కోవిడ్ ప్రారంభం లో వ్యాధి బారిన పడిన వ్యక్తి కంటే ప్రస్తుత రోజుల్లో కోవిడ్ సోకిన వ్యక్తి యొక్క మనుగడకు మంచి అవకాశాలు ఉన్నాయని మనం అందరం గుర్తుంచుకుంటే, కోవిడ్ -19 గురించి భయపడాల్సిన అవసరం లేదు.దీనిని నివారించడానికి అందరూ కింది సాధారణ జాగ్రత్తలను బాధ్యతగా అనుసరిద్దాం:
 • – ఇతరుల నుండి 6 అడుగుల దూరం పాటించడం.
 • – సరైన మాస్కులు ధరించడం
  – ఆహారానికి టెక్ అవే ద్వారా కిరాణా మరియు కూరగాయల డెలివరీ కోసం ఆర్డర్ చేయండి.
 • – ఇంటి నుండి పని చేయండి, అనవసరంగా బయటకు వెళ్ళకండి.
 • – హ్యాండ్ వాష్ & పరిశుభ్రత పాటించండి.
 • ఈ రకంగా కరోనా వ్యాధి నివారణ అనేక మలుపులు తిరుగుతూ వైద్యులకే ఒక ఛాలెంజ్ గా మారటం దానిని మన వైద్యులు గత నాలుగు నెలలుగా అధిగమించటం కొరకు ప్రతినిత్యం శ్రమిస్తూ ఉంటే మనము అజాగ్రత్తగా ఉండటం ఆస్పత్రి పాలు కావటం , ఇంటిల్లపాదికి వ్యాధిని అంటించడం బాధ్యతారాహిత్యం అవుతుంది.
 • జాగ్రత్తగా ఉందాం !!
  __________
  Dr. Arja Srikanth

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *