Breaking News

శ్రీభాగ్ ఒప్పందానికి పునరుజ్జీవం

  • ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో

  • అన్ని ప్రాంతాలకు సమాన న్యాయం

  • వికేంద్రీకరణ బిల్లుకు ఆమోదం హర్షణీయం 

  • ఏపీ డిప్యూటీ సిఎం అంజాద్ భాష 

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అవతరణ ముందు 1937 లో జరిగిన శ్రీబాగ్ ఒప్పందం లో రాయలసీమ ప్రాంతమైన కర్నూలులో రాజధాని లేక హైకోర్టు ఏర్పాటు, ఉత్తరాంధ్ర అభివృద్ధి, వంటి అంశాలను పొందుపరిచారు. కానీ ఆంధ్ర ప్రదేశ్ ఏర్పడిన తర్వాత హైదరాబాదును రాజధానిగా ప్రకటించడంతో రాయలసీమ వారు రాజధాని కోల్పోవడం జరిగింది. ఆ నాటి నుండి ఇప్పటి వరకు అన్ని ప్రాంతాల ప్రజలకు ఇబ్బందులు వస్తూనే ఉన్నాయి. తెలంగాణ విడిగా ఏర్పడిన తర్వాత కూడా శ్రీబాగ్ ఒడంబడిక అంశం తెరపైకి వచ్చింది, కానీ అప్పటి ప్రభుత్వం, ప్రజల సమస్యలను పట్టించుకోక, వారి అభిప్రాయాలకు గౌరవం ఇవ్వక వారి ఇష్టారాజ్యంగా పాలన సాగిస్తూ వచ్చారు. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విడిపోయిన నాటినుండి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మన రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు అన్ని ప్రాంతాలకు సమ న్యాయం చేయాలని, పాలన వికేంద్రీకరణ లో భాగంగా అన్ని ప్రాంతాలను సమగ్రంగా అభివృద్ధి చేయాలని, ఆనాటి శ్రీభాగ్ ఒడంబడిక అంశాలను పరిగణలోకి తీసుకోవాలని పోరాడుతూ వస్తున్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన అనంతరం గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు అన్ని ప్రాంతాలను సమూలంగా అభివృద్ధి చేయాలని, పాలన వికేంద్రీకరణ లో భాగంగా పరిపాలన రాజధానిగా విశాఖపట్నం, శాసన రాజధానిగా అమరావతి, న్యాయ రాజధానిగా కర్నూలును గుర్తించారు. అంతేకాకుండా అదే బిల్లును శాసన సభలో ప్రవేశపెట్టి అందరి ఆమోదం పొందారు. కానీ ప్రతిపక్షం ఎన్ని ఆటంకాలు సృష్టించిన మూడు రాజధానుల బిల్లుకు గవర్నర్‌ గారు ఆమోదించడంతో మా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు సాధించగలిగారు. ఈ మూడు రాజధానులు వల్ల అన్ని ప్రాంతాలు సమూలంగా అభివృద్ధి చెందుతుంది. ఆ నాటి శ్రీబాగ్ ఒప్పందాన్ని ప్రజలతో కలిసి రాష్ట్ర ప్రభుత్వం సాధించింది. భవిష్యత్తులో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల మధ్య అసమానతలు తలెత్తకుండా, ప్రాంతాల మధ్య భేదాభిప్రాయాలకు అవకాశం లేకుండా రాష్టం సమగ్రాభివృద్ధి సాధించడానికి రాష్ట్ర ప్రజల అభీష్టం మేరకు మూడు రాజధానులు ఎంతైనా అవసరం. అంతేకాకుండా అమరావతి రైతులు నష్టపోకుండా వారిని కూడా అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు ఎల్లవేళలా సిద్ధంగా ఉన్నారు. ప్రస్తుతం అమరావతి రైతుల సమస్య న్యాయస్థానం ఎదుట ఉన్నందున, న్యాయస్థానం తీర్పును గౌరవించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *