Literature

మార్చి 6న విజయవాడలో సాహిత్య సభ

కథల పోటీల విజేతలకు బహుతి ప్రదానం

శ్రీరామకవచ సాగర్
కవి, నవలా రచయిత

విజయవాడ ఠాగూర్ స్మారక గ్రంథాలయం ఆడిటోరియంలో ఈనెల 6న ఆదివారం ఉదయం మల్లెతీగ-చిన్ని నారాయణరావు ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన కథల పోటీ విజేతలకుబహుమతి ప్రదానోత్సవ సభను నిర్వహించనున్నారు. సుప్రసిద్ధ నవలా రచయిత శ్రీరామకవచం సాగర్ అధ్యక్షత వహించే ఈ సభకు ముఖ్య అతిధిగా విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణువర్ధన్ హాజరుకానున్నారు. అతిధులుగా ఏపీ మైనారిటీస్ వెల్ఫేర్ స్పెషల్ సెక్రెటరీ ఎఎండి ఇంతియాజ్, ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ పరిషత్ ఛైర్మన్ మందపాటి శేషగిరిరావు, అరసం జాతీయ కార్యదర్శి పెనుగొండ లక్ష్మీనారాయణ, కృష్ణాజిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్ పర్సన్ టి.జమలాపూర్ణమ్మ, బహుమతి ప్రదాత, ‘మాట’ దీర్ఘకావ్యం రూపశిల్పి చిన్ని నారాయణరావు పాల్గొంటారు. ఈ కార్యక్రమంలో మొదటి బహుమతిని వాసంతి (సికింద్రాబాద్), రెండవ బహుమతిని సృజన్ సేన్ (హైదరాబాద్), మూడవ బహుమతిని వడలి రాధాకృష్ణ (చీరాల) అందుకోనున్నాను. ప్రత్యేక బహుమతుల్ని విహారి (హైదరాబాద్), సింహప్రసాద్ (హైదరాబాద్), బాలి (విశాఖపట్నం), శరత్ చంద్ర (హైదరాబాద్), బళ్ళా షణ్ముఖరావు(విశాఖ), జిల్లెళ్ళ బాలాజీ (తిరుపతి), తటవర్తి నాగేశ్వరి (కొవ్వూరు), వియోగి (కర్నూలు), టి.తిప్పారెడ్డి (మదనపల్లి), జ్యూరీ బహుమతిని శైలజామిత్ర (హైదరాబాద్) అందుకోనున్నారు. ఈ ‘మాట’ దీర్ఘకావ్యం రూపశిల్పి చిన్ని నారాయణరావు సౌజన్యంతో, మల్లెతీగ నిర్వహిస్తున్న ఈ సభలో చిన్ని నారాయణరావు ఫౌండేషన్ ఉగాది ప్రత్యేక పురస్కారాలను కవిసంధ్య సంపాదకులు కళారత్న డాక్టర్ శిఖామణి, సుప్రసిద్ధ సాహితీవేత్త శ్రీరామకవచం సాగర్, సుప్రసిద్ధ కవి ఏటూరి నాగేంద్రరావు, మల్లెతీగ సంపాదకులు కలిమిశ్రీ అందుకోనున్నారు.

Share this News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *