అమరజీవి బలిదానంపై నేడు జూమ్ సమావేశం
ప్రముఖ రచయిత డాక్టర్ నాగసూరి వేణుగోపాల్ సంపాదకత్వంలో వెలువడిన ‘అమరజీవి బలిదానం..పొట్టి శ్రీరాములు పోరాటగాధ’ పుస్తకాన్ని పరిచయం చేసేందుకు ఈనెల 7 శనివారం సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్ లోని స్ప్రెడింగ్ లైట్ సంస్థ జూమ్ సమావేశం నిర్వహించనుంది. నాగసూరి వేణుగోపాల్ సమన్వయంలో నిర్వహించినున్న సమావేశంలో మనం మరిచిపోయిన అమరజీవి అనే అంశంపై నెల్లూరులోని విజ్ఞన ప్రచురణలకు చెందిన జి.మాల్యాద్రి, ‘ఇలాంటి పుస్తకాల ఆవశ్యకత, అందించే స్ఫూర్తి’ అనే అంశంపై విశ్రాంత ఇన్ కం ట్యాక్స్ చీఫ్ కమిషనర్ మేడిశెట్టి తిరుమల కుమార్ ప్రసంగించనున్నారు. ప్రముఖ చరిత్ర పరిశోధకుడు డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి, ఎమెస్కో ప్రచురణల ప్రతినిధి లక్ష్మీ, రచయిత దామరాజు నాగలక్ష్మితో పాటు ఆంధ్రప్రదేశ్ గ్రంధాలయ సంఘం, ప్రజా సైన్స్ వేదిక, విల్లా హైట్స్ రీడర్స్ ఫోరం ప్రతినిధులు కూడా జూమ్ సమావేశంలో పాల్గొని తమ అభిప్రాయాలు వెల్లడించనున్నారు. స్ప్రెడింగ్ లైట్ ప్రతినిధి సి.రామ్ అనుసంధాన బాధ్యతలు నిర్వహించనున్నారు.