Literature

మార్మోగుతున్న వేమన పద్యం

1000 మందితో వేమన పద్యం.. ఆరవ రోజు

మాట్లాడుతున్న డాక్టర్ నూకతోటి రవికుమార్

జానుడి- సెంటర్ ఫర్ లిటరేచర్ అండ్ ఆర్ట్స్, శ్రీరామ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ఒంగోలు సంయుక్తంగా నిర్వహిస్తున్న‘వెయ్యి మందితో వేమన పద్యం’ కార్యక్రమంలో భాగంగా ఆరవ రోజు మధురకవి మల్లవరపు జాన్  97వ జయంతి సభని ఒంగోలు పివిఆర్ బాలికల ఉన్నత పాఠశాలలో శుక్రవారం నిర్వహించారు.  450 మంది విద్యార్థులు వేమన పద్యాలతో పాటు, మధురకవి మల్లవరపు జాన్ సూక్తి శతకంలోని పద్యాలను ఆలపించారు. కార్యక్రమం ఆద్యంతం ఎంతో ఆసక్తిగా నిర్వహించడంలో ప్రధానోపాధ్యాయులు లక్ష్మీప్రసన్న, తెలుగు ఉపాధ్యాయులు రమణమ్మ, మల్లికార్జునుడు, జయసుధలతో పాటు ఉపాధ్యాయుడు ఏ.వి.ప్రతాప్ ఎంతగానో తోడ్పాటునందించారు.పివిఆర్ బాలికల ఉన్న పాఠశాల విద్యార్థులతో లక్ష్యం పూర్తయింది. ఇప్పటికీ మరో వెయ్యి మంది విద్యార్థులకు కార్యక్రమానికి నమోదు చేసుకున్న నేపథ్యంలో నాలుగు స్కూళ్లలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటుచేసినట్టు కార్యక్రమ నిర్వాహకుతు తెలిపారు.

వేమన పద్యాలు పాడుతున్న విద్యార్ధులు

Share this News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *