ఆస్టర్ ప్రైమ్ లో ప్రెగ్నెన్సీ ప్యాకేజీలు
- ఆస్టర్ నర్చర్ పేరుతో గర్భిణుల కోసం..
- తక్కువ ధరలతో 9 మాసాల ప్యాకేజీలు
ఆస్టర్ ప్రైమ్ హాస్పిటల్స్, అమీర్ పేట, హైదరాబాదు వారు ఆస్టర్ నర్చర్ పేరుతో గర్భిణుల కోసం అత్యంత తక్కువ ధరలతో ప్రత్యేకంగా రూపొందించిన 9 మాసాల గర్భదారణ ప్యాకేజీలను మంగళవారం (30.11.21) ప్రవేశ పెట్టారు. ఇలా కొత్తగా ప్రవేశ పెట్టిన ఈ ప్యాకేజీలు మహిళలలో అమ్మతనం తీసుకొని వచ్చే పూర్తి ప్రయాణకాలం .. అంటే గర్భదారణ సమయం నుండి ప్రసవం వరకూ జరిగే మొత్తం ప్రయాణాన్ని దృష్టిలో ఉంచుకొని ఆరోగ్య సేవలు అందించేలా రూపొందించారు. ఈ ప్యాకేజీలలో భాగంగా గర్భిణులైన మహిళలకు మొత్తం తొమ్మిది మాసములలో అవసరమైన అని రకములైన ఆరోగ్య సేవలతో పాటూ పిజియోథెరపీ, సైకలాజికల్ కౌన్సిలింగ్ వంటి సేవలు కూడా చేర్చారు.
ఈ ప్యాకేజీలలో భాగంగా మొత్తం 9 నెలలలో 10 ఉచిత కన్సల్టేషన్లు, ఐదు ప్రత్యేకమైన స్కాన్ లతో పాటూ నిపుణులైన వైద్యులు సూచించిన అవసరమైన ల్యాబొరేటరీ పరీక్షలన్నీ మొత్తం తొమ్మిది నెలల కాలంలో చేయనున్నారు. అంతే గాకుండా ప్రసవ సమయంలో హాస్పిటల్ లో అవసరమైన రోజులు ఉండడానికి కూడా ఈ ప్యాకేజీ వీలు కలపిస్తుంది. అంతే గాకుండా గర్భిణులు తాము కోరుకున్న రీతిలో కోరుకున్న సమయంలో (ఆరోగ్య పరిస్థితులను బట్టి) ప్రసవాన్ని చేసుకొనే అవకాశాన్ని కూడా ఈ ప్యాకేజీలు వీలు కల్పిస్తాయి. అంతే కాకుండా ఈ ప్యాకేజీ తీసుకొన్న ప్రతి గర్భిణి మహిళకు 8886657891 అనే హెల్ప్ లైన్ ద్వారా ఒక సహాయకుడు నిరంతరాయం అందుబాటులో ఉండి 9 నెలల పాటూ అవసరమైన సలహాలు, సూచనలు అందించడమే కాకుండా తగిన చికిత్స, సహాయం అందేలా చూస్తారు.
ఆస్టర్ నర్చర్ ప్యాకేజీలను రెండు రకాలుగా రూపొందించారు. గర్భిణీ మహిళలకు వారి వారి ప్రత్యేక అవసరాల దృష్ట్యా ఈ ప్యాకేజీలను సాధారణ ప్రసవానికి సంబంధించిన ప్యాకేజీ ..క్రింద భాగంలో నిర్వహించే సిజేరియన్ శస్త్ర చికిత్స ప్యాకేజీలుగా విభజిచంారు. వారు వినియోగించే రూము సదుపాయాన్ని అనుసరించి సాధారణ ప్రసవానికి సంబంధించిన ప్యాకేజీ యొక్క ధరలు రూ. 65000 వేల నుండి రూ. 80,000 లుంటే.. సిజేరియన్ శస్త్ర చికిత్స ప్యాకేజీలు రూ. 88,000 ల నుండి రూ. 1,08,000 ల వరకూ ఉంటాయి. హైదరాబాదులోని ఇతర హాస్పిటల్స్ లో ఉండే ఇలాంటి ప్యాకేజీలతో పోలిస్తే ఇవి అత్యంత తక్కువ ధరలలో ఉండేలా రూపొందించారు.
ఇలా రూపొందించిన ప్రత్యేక ప్యాకేజీలను ఆస్టర్ ప్రైమ్ హాస్పిటల్ లో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో మార్కెట్ లో ప్రవేశ పెట్టారు. అమీర్ పేట కార్పొరేటర్ కేతినేని సరళ ముఖ్య అతిథిగా, రచయిత, కళాకారిణి అనిత పీటర్ లు ప్రత్యేక అతిథిగా హాజరై ప్యాకేజీ బ్రోచర్ ను విడుదల చేశారు. ఈ సందర్భంగా కేతినేని సరళ మాట్లాడుతూ అత్యంత తక్కువ ధరలలో ప్యాకేజీలు సమగ్రమైన చికిత్స అందించేలా రూపొందించిన హాస్పిటల్ యాజమాన్యాన్ని అభినందించారు.
అంతకు ముందు కార్యక్రమంలో కెటి దేవానంద్, క్లస్టర్ CEO ఆహూతులకు స్వాగతం పలుకుతూ ప్యాకేజీ రూపకల్పన వెనుక ఉద్దేశ్యాలను వివరించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ వి. మీరా రాజగోపాల్, HOD, గైనకాలజీ ఆబస్ట్ర్రిక్స్.. ఉమా శ్రీదేవి, ఛీఫ్ ఆఫ్ మెడికల్ సర్వీసెస్ .. డా. పి తనూజ, కన్సల్టెంట్ గైనకాలజిస్టు, డా. టి నరేందర్, HOD, పీడియాట్రిక్స్ విభాగం తో పాటు ఇతర వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.