ap news

జగన్ తో చిరంజీవి భేటీ

  • చర్చలు సంతృప్తికరం..
  • సీఎం ఎంతో ఆప్యాయత చూపారు..
జగన్ ను శాలువాతో సత్కరిస్తున్న మెగాస్టార్ చిరంజీవి

సినిమా టికెట్ల వివాదంపై మెగాస్టార్ చిరంజీవి గురువారం రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహన్ రెడ్డితో భేటీ అయ్యారు. హైదరబాద్ నుంచి ప్రత్యేక విమానంలో వచ్చిన తాడేపల్లిలోని సీఎం నివాసానికి వచ్చి జగన్ తో భేటీ అయ్యారు. ఇద్దరూ కలిసి భో్జనం కూడా చేశామనీ,జగన్ దంపతులు ఎంతో ఆప్యాయత చూపారని ఈ సందర్భంగా చిరంజీవి వ్యాఖ్యానించారు. సీఎంతో చర్చలపై ఇంకా ఏమన్నారంటే..ఆయన మాటల్లోనే.. 

టికెట్ వివాదం జటిలం అవుతున్న తరుణంలో సీఎం వైఎస్ జగన్ సినీ పరిశ్రమకు చెందిన వ్యక్తి గా నన్ను ఆహ్వానించారు..సినిమా అందరికి అందుబాటులో ఉండాలన్న ఆయన ఆలోచన నాకు నచ్చింది..అలాగే ఎగ్జిబిటర్లు కూడా ఇబ్బందులు పడుతున్నారని చెప్పాను..రెండువైపులా అంశాలను తెలుసుకోవాలని సీఎం జగన్ ఆకాక్షించారు..కోవిడ్ సమయంలో సినీ పరిశ్రమ లో కార్మికులు దయనీయ పరిస్థితి లో గడిపారు..సినీ పరిశ్రమ సాధక బాధలను తెలుసుకున్నాను అని సీఎం చెప్పారు..ఉభయ వర్గాలకు ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకుంటామని సీఎం చెప్పారు..సినిమా టికెట్ల విషయంలో పునరాలోచన చేస్తున్నమని చెప్పారు..సినీ పెద్దగా కాదు బిడ్డగా నేను ఇక్కడి కి వచ్చా..త్వరలోనే జీవో ఇస్తామని సీఎం చెప్పారు..ఐదో షో ఉండాలా లేదా అన్న విషయం పై కూడా ఆలోచన చేస్తామని చెప్పారు..సినిమా పరిశ్రమలో ని వ్యక్తులు ఎవరూ లేని పోనీ కామెంట్స్ చేయొద్దని విజ్ఞప్తి చేస్తున్నా..పెద్ద బడ్జెట్ సినిమానా లేక చిన్న సినిమానా అన్న భేదం లేకుండా అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయం వస్తుందని ఆశిస్తున్నా..రెండు మూడు వారాల్లో ప్రభుత్వం నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంది…త్వరలోనే కమిటీ సమావేశనికి ప్రభుత్వ ఆహ్వానం మేరకు వస్తామని చిరంజీవి తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WhatsApp