ap newsMedical and Health

బర్డ్ ఫ్లూ ఎవరికీ సోకలేదు.

అనుమానిత నమూనాల పరీక్షల రిపోర్టులు నెగిటివ్

కలెక్టర్ల ఆధ్వర్యంలో నిరంతరం పర్యవేక్షణ

కేంద్ర బృందం పర్యటన

-రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ వీరపాండియన్ వెల్లడి

చిత్తూరు, అన్నమయ్య, ఇతర జిల్లాల్లో ఎక్కడా కూడా మనుషులకు బర్డ్ ఫ్లూ వచ్చిన దాఖలాలు లేవని రాష్ట్ర వైద్య, ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ వీరపాండియన్ వెల్లడించారు. చిత్తూరు జిల్లాలో ఓ యువకుడికి ఏవియన్ ఇన్ఫ్లూంజా (బర్డ్ ఫ్లూ ) సోకినట్లు జరుగుతున్న ప్రచారంలో ఎటువంటి వాస్తవం లేదని స్పష్టంచేశారు. సదరు వ్యక్తి నుంచి సేకరించిన నమూనాను వైరాలజీ ల్యాబ్లో పరీక్షించగా నెగిటివ్ అని రిపోర్టు వచ్చిందని తెలిపారు. దీనిపై ఎవరూ ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరంలేదని శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు.

కుటుంబ సభ్యుల నుంచి ఆరోగ్య వివరాల సేకరణ

చిత్తూరు, అన్నమయ్య జిల్లాల్లో కోళ్లకు వచ్చిన బర్డ్ ఫ్లూ మనుషుల వరకు రాకుండా ఉండేందుకు వైద్య ఆరోగ్య శాఖ అవసరమైన అన్ని ముందస్తు చర్యలు తీసుకుంటోందని పేర్కొన్నారు. ప్రభావిత ప్రాంతాల్లోని కోళ్ల ఫారాల్లో పనిచేసే వారికి ‘ఓసెల్టామివర్’ మాత్రలను అందచేసినట్లు తెలిపారు అంతేకాకుండా ఎన్. 95 మాస్కులు, శానిటైజర్లు పంపిణీ చేసినట్లు పేర్కొన్నారు. లోతైన సర్వైలెన్స్లో భాగంగా క్షేత్రస్థాయిలోని పరిస్థితుల గురించి తెలుసుకునేందుకు సదరు ప్రభావిత గ్రామాల్లోని కుటుంబ సభ్యుల నుంచి వైద్య సిబ్బంది ఆరోగ్య వివరాలు సేకరించినట్లు వెల్లడించారు.

ప్రభుత్వాల శాఖల పరస్పర సమన్వయం

ఈ క్రమంలో అనుమానిత లక్షణాలు కలిగిన వారి నుంచి సేకరించిన నమూనాలను తిరుపతిలోని స్విమ్స్ ల్యాబ్లో పరీక్ష చేయించగా ఇప్పటివరకు వచ్చిన 54 రిపోర్టులూ నెగిటివ్ ఉన్నాయని తెలిపారు. ముందు జాగ్రత్తగా చిత్తూరు, మదనపల్లె పట్టణాల్లోని ఆసుపత్రుల్లో ప్రత్యేకంగా పడకలు సిద్ధం చేశామని తెలిపారు ఏవియన్ ఇన్ఫ్లూంజా అనేది పక్షులకు సంబందించినదని, నిర్దిష్ట ప్రమాణాలు పాటించి సరైన రీతిలో వండిన కోడి మాసం, గుడ్లు వినియోగం సురక్షితమేనని చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అధికారులు వర్చువల్ విధానంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో సమీక్షలు జరుపుతూ తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సర్వైలెన్స్ పటిష్టతపై సలహాలు, సూచనలు ఇస్తున్నారు. అంతేకాకుండా సదరు జిల్లాల కలెక్టర్ల ఆధ్వర్యంలో రెవెన్యూ, పంచాయతీ, వైద్య, ఆరోగ్య శాఖ, పోలీసు, ఇతర శాఖల అధికారులు సమన్వయంతో క్షేత్రస్థాయిలోని పరిస్థితులను గమనిస్తున్నారని తెలిపారు. ఢిల్లీ నుంచి వచ్చిన కేంద్ర బృందం జిల్లాల్లో పర్యటిస్తుందని పర్యటిస్తోoదని వీరపాండియన్ వివరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *