ap news

మన దేవాలయం – మన హక్కు

లక్ష్మీ సుకన్య ఆధ్వర్యంలో విస్తృతంగా సంతకాల సేకరణ

  • మన దేవాలయం – మన హక్కు పేరుతో బీజేపీ నాయకురాలు పండ్రింగి లక్ష్మీ సుకన్య ఆధ్వర్యంలో పార్టీ కార్యకర్తలు గుంటూరు నగరంలో విస్తృత ప్రచారం నిర్వహిస్తూ భక్తులతో సంతకాల సేకరణ చేపడుతున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి పిలుపు మేరకు రాష్ట్ర  ఉపాధ్యక్షుడు చందు సాంబశివరావు, పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు పాటిబండ్ల రామకృష్ణ  పర్యవేక్షణలో సంతకాల సేకరణ కార్యక్రమం చేపడుతున్నట్టు ఆమె ఆంద్రావని ప్రతినిధికి తెలిపారు. అమరావతి రోడ్డులోని ఆంజనేయస్వామి గుడి వద్ద మంగళవారం చేపట్టిన సంతకాల సేకరణ కార్యక్రమానికి భక్తుల నుంచి విశేష స్పందన వచ్చిందనీ, రెండు రోజుల్లోనే సుమారు 2600 మంది సంతకాలు సేకరించినట్టు తెలిపారు. హిందూ దేవాలయాల్లో పదవులను అన్యమతస్తులకు కట్టబెట్టటాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామనీ, ఈ మేరకు భక్తుల్లో చైతన్యం ప్రోది చేస్తున్నామని వెల్లడించారు. సుకన్యతో పాటు కృష్ణా జిల్లా సహ ఇన్ చార్జి కొక్కెర శ్రీనివాస యాదవ్, గుంటూరు పశ్చిమ అసెంబ్లీ 1వ మండల అధ్యక్షుడు బలగాని సాంబశివరావు, ఆవుల రాము, ఈదర శ్రీనివాసరెడ్డి, తిరుమల శెట్టి వెంకటరమణ నాయుడు, కె.వి ప్రసాద్, మాగంటి సుధాకర్ యాదవ్, ఈమని మాధవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
భక్తుల నుంచి సంతకాలు సేకరిస్తున్న లక్ష్మీ సుకన్య

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WhatsApp