ఒంగోలుకు నీళ్ళివ్వండి
మంచినీటి సమస్యను శాశ్వతప్రాతిపదికపై పరిష్కరించాలి
ఒంగోలు సిటిజన్ ఫోరం అధ్యక్షుడు కొల్లా మధు
ఒంగోలు నగరంలో మంచినీటి సమస్యను శాశ్వత ప్రాతిపదికపై పరిష్కరించాలని సిటిజన్ ఫోరం అధ్యక్షుడు కొల్లా మధు డిమాండ్ చేశారు. 1983వ సంవత్సరంలో ఎమ్మెల్యేగా గెలుపొందిన దివంగత పొనుగుపాటి కోటేశ్వరరావు తాను అధికారం చేపట్టిన కొద్ది సమయంలోనే మొదటి సమ్మర్ స్టోర్ ట్యాంక్ నిర్మాణం చేపట్టి చరిత్రలో నిలిచిపోతే..గడిచిన 25 ఏళ్ళుగా రెండో సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్, రెండో ఫీల్టర్ బడ్, కొన్ని వాటర్ ట్యాంక్ లు మాత్రమే నిర్మాణానికి నోచుకున్నాయన్నారు. సుమారు 3.5 లక్షలకు చేరువయిన ఒంగోలు నగర ప్రజల దాహార్తిని తీర్చేందుకు ఇపుడున్న నీటి వనరులు మాత్రమే సరిపోవన్న సంగతిని అందరూ గుర్తెరగాలన్నారు. రామతీర్థం, గుండ్లకమ్మ ప్రాజెక్టు నిర్మాణాలు పూర్తయినా నగరంలో నాలుగు రోజులకు ఒక్క సారి మాత్రమే నీళ్ళు వస్తున్నాయి. గుండ్లకమ్మ ప్రాజెక్టు నుంచి వైపులైన్ ద్వారా 100 కోట్ల రూపాయలతో ప్రారంభించిన పనులు నత్తనడకన నడుస్తున్నాయి. ఒంగోలు నగర పాలక సంస్థ మంచినీటి సమస్య శాశ్వత పరిష్కాకరం కోసం ఏ మాత్రం ప్రయత్నించటం లేదు. రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో వేలాది కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులు పూర్తయి అందుబాటులోకి వస్తన్నా ఒంగోలు నగరం మాత్రం అలాంటి వాటికి నోచుకోవటం లేదు. గడిచిన 25 ఏళ్ళుగా ఇదే నిర్లక్ష్యం కొనసాగుతోంది. ఫలితంగా చెరువులు అడుగంటుతున్నాయి. భవిష్యత్ లో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితు ఏర్పడవచ్చు. ఈ నేపథ్యంలో శాశ్వత మంచినీటి సమస్య పరిష్కారం కోసం ప్రయత్నించాలని మధు కోరారు.