పవన్ పై కుట్రలు సాగనివ్వం
నియంతలు కాలగర్బంలో కలిసిపోయారు
ఒంగోలులో ధ్వజమెత్తిన సుబ్బరాయ గుప్త
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కుట్రలు, కుతంత్రాలు చేస్తే రాష్ట్రం అట్టుడికిపోతుందని సుబ్బారావు గుప్త అన్నారు. రెక్కీలు చేసి బెదిరిస్తూ రౌడీ రాజకీయాలు చేసే వారిని ఎలా ఎదుర్కోవాలో జనసైనికులకు బాగా తెలుసు..ఒంగోలులో సుబ్బారావు గుప్త (తనపై) చేసి దాడి చేసినంత సులభంగా పవన్ జోలికి వెళ్ళాలనుకోవటం ఒక భ్రమ..పవన్ ఒక ప్రభంజనం..ప్రజలకు మంచి చేయటం కోసం రాజకీయాల్లోకి వచ్చిన నాయకుడు..అలాంటి నేతను దౌర్జన్యాలతో దెబ్బతీయాలనుకోవటం భ్రమ..చరిత్రలో ఎంతో మంది నియంతలు మట్టి కరిచారు.. పాపం పండే రోజంటూ వస్తుంది.. ప్రజలు సమయం కోసం ఎదురుచూస్తున్నారని సుబ్బారావు గుప్త అన్నారు.