శభాష్..! ఒంగోలు పోలీసులకు హోం మంత్రి ప్రశంసలు
- 300 కేజీల వెండి ఆభరణాల రికవరీ
- దొంగల ముఠా అరెస్ట్
![](https://andhravani.net/wp-content/uploads/2024/12/chori-vendi-300x200.jpg)
రాష్ట్రంలోని 100 దేవాలయాల్లో చోరీకి పాల్పడి 300 కేజీల వెండి ఆభరణాలను చోరీ చేసి విక్రయించి వచ్చిన రూ.15.5లక్షల సొమ్ముతో జల్సాలు చేస్తున్న దొంగల ముఠాను పట్టుకోవడం అభినందనీయం. గూగుల్ మ్యాప్ ద్వారా దేవాలయాలను గుర్తించి చోరీ చేశాక దేవాలయాల్లోని సీసీ కెమెరాల డీవీఆర్ ను పట్టుకెళ్లి దొరక్కుండా తిరుగుతున్న ముఠా గుట్టు రట్టు చేసిన ఒంగోలు ఎస్పి ఏఆర్ దామోదర్ నేతృత్వంలోని పోలీసు బృందాన్ని హోంమంత్రి శభాష్ అని మెచ్చుకున్నారు.
![](https://andhravani.net/wp-content/uploads/2024/12/chori-vendi-one-300x155.jpg)