గుంటూరు మేయర్ తో ఒంగోలు మేయర్ భేటీ

ఒంగోలు నగర పాలక సంస్థ మేయర్ గంగాడ సుజాత గుంటూరు నగర పాలక సంస్థ మేయర్  కావటి శివ నాగ మనోహర్ నాయుడుతో  ఆయన ఛాంబర్ లో  మర్యాద పూర్వకంగా భేటీ అయ్యారు. గుంటూరు నగరంలో చేపడుతున్న అబివృద్ధి పనులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సుజాతను మనోహర్ నాయుడు శాలువా, బొకేతో సత్కరించి అభినందించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ లు పాల్గొన్నారు.

ఒంగోలు మేయర్ గంగాడ సుజాతను సత్కరిస్తున్న గుంటూరు మేయర్ కావటి మనోహర్ నాయుడు

Leave a Reply

Your email address will not be published.