ఒంగోలులో ‘రంగుల’ సమ్మర్ క్యాంప్
ఒంగోలులో ‘రంగుల సమ్మర్ క్యాంప్’ ప్రారంభమైంది. రంగుల ఆర్ట్స్ గ్యాలరీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సమ్మర్ క్యాంప్ ను ఒంగోలు నగరపాలక సంస్థ కమిషనర్ కోడూరి వెంకటేశ్వరరావు ప్రారంభించారు. చిత్రకళలు, సంగీతం, అన్నమయ్య సంకీర్తనలు, హ్యాండ్ రైటింగ్ స్కిల్స్ ను విద్యార్ధులకు రంగుల ఆర్ట్స్ గ్యాలరీ గ్యాలరీ నిర్వాహకులు సంధ్య రంగుల తెలిపారు. ఉదయం 11 గంటల నుంచి 12 గంటల వరకు, సాయంత్రం 4 నుంచి 8 గంటలల వరకు సమ్మర్ క్యాంప్ నిర్వహించనున్నట్టు తెలిపారు. ఈ అవకాశాన్ని విద్యార్ధులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా విద్యార్ధులకు కమిషనర్ నచ్చిన చిత్రాలను బహుహకరించారు. గీసిన చిత్రాలను కమిషనర్ వీక్షించారు. ఈ కార్యక్రమంలో రచయితలు నూనె అంకమ్మరావు, కుర్రా ప్రసాద్, నాగభైరవ ఆదినారాయణ, చిత్రకారిణి వేల్పూరి రాధ, సుధారాణి, మల్లిక తదితొాొంారులు పాల్గొన్నారు.
