రూ 30 కోట్ల నష్టపరిహారం విడుదల

గ్యాస్ లీక్ మృతులు, బాధితుల కోసం..

విశాఖపట్టణంలోని ఎల్.జి పాలిమర్స్ గ్యాస్ లీక్ వల్ల చనిపోయిన వారితో పాటు ఇతర బాధితుల కోసం రాష్ట్ర ప్రభుత్వం 30 కోట్ల రూపాయల నష్టపరిహారాన్ని విడుదల చేసింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్వర్వులు జారీ చేసింది. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి కోటి రూపాయల నష్టపరిహారాన్ని ప్రకటించిన ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం నిధులను కూడా 24 గంటల్లోపు విడుదల చేశారు. ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నవారితో పాటు మూగజీవాల యజమానులకు కూడా పరిహారం అందనుంది. చనిపోయిన వారికి ఒక్కొక్కరికి కోటి రూపాయల చొప్పున పరిహారాన్ని వారి కుటుంబసభ్యలకు అందచేయనున్నారు.

Hits: 14

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *