జర్నలిస్టులపై మార్మోగుతున్న పాట

జర్నలిస్టుల జీవితాలు ‘నానాటికీ తీసికట్టు..నాగంభొట్టు’ చందంగా తయారవుతున్నాయి. కరోనా పేరు చెప్పి వందలాది మంది ఉద్యోగులను ప్రధాన పత్రికలు తీసేశాయి. పనిచేస్తున్న వారికి కూడా జీతాలు తెగ్గోస్తున్నాయి. కొన్ని సంస్థలు నెలల తరబడి జీతాలు ఇవ్వటం లేదు. ఇక..గ్రామీణ జర్నలిస్టుల పరిస్థితయితే మరింత దారుణంగా మారింది. వీరిని అసలు పట్టించుకునే దిక్కులేకుండా పోయింది. నిజానికి తెలుగు మీడియాకు గ్రామీణ పాత్రికేయులు అందించే సేవలు ఎక్కువే అయినా వారికి అందే వేతనాల గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. చివరకు జర్నలిస్టులు కరోనా సమయంలో నిరాశ్రయుల్లా దాతలందించే సహాయాన్ని తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. వారి ఆకలి కేకల్ని యాజమాన్యాలు పట్టించుకోవటం లేదు. పనిచేస్తే చేయండి..పోతే పోండనే ధోరణితో వ్యవహరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో జర్నలిస్టుల స్థితి గతుల గురించి సీనియర్ పాత్రికేయుడు కోలా హరిబాబు రచించిన పాట ఉభయ తెలుగు రాష్ట్రాల్లో మార్మోగిపోతోంది. ప్రముఖ గాయకుడు నూకతోటి శరత్ బాబు ఈ పాటను హృద్యంగా ఆలపించారు. పాత్రికేయుల వెతలనూ, యాతనను నిశ్చలనీటిలో ప్రతిబింబలా మన కళ్ల ముందు నిలిపిన ఈ పాటను మీరూ వినండి..నచ్చితే ఎక్కువ మందికి షేర్ చేయండి..

Hits: 5

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *