సుందరయ్యకు భారతరత్న ఇవ్వాలి

  • కేంద్రానికి సిఎం సిఫారసు చేయాలి
  • ఒంగోలు సిటిజన్ ఫోరం అధ్యక్షుడు కొల్లా మధు
కొల్లా మధు
అధ్యక్షుడు
ఒంగోలు సిటిజన్ ఫోరం

జగమెరిగిన కమ్యూనిస్టు, ఆదర్శనీయుడు దివంగత పుచ్చలపల్లి సుందరయ్య కు భారతరత్న అవార్డు ఇవ్వాలని ఒంగోలు సిటిజన్ ఫోరం అధ్యక్షుడు కొల్లా మధు ఒక ప్రకటనలో కోరారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేయాలని విజ్ఞప్తి చేశారు. తెలుగు రాష్ట్రాల్లో 1963లో జాకీర్ హుస్సేన్ కు తప్ప ఎవరికీ ఇంతవరకు భారతరత్న అవార్డు రాలేదన్నారు. తెలంగాణా రైతాంగ సాయుధ పోరాట వీరుడు, స్వాతంత్ర్య సమర యోధుడు. కమ్యూనిస్టు గాంధీగా పేరొందిన సుందరయ్య భారతరత్న అవార్డుకు అర్హులని మధు వ్యాఖ్యానించారు. జీవితాంతం తను నమ్మిన సిద్దాంతానికి త్రికరణ శుద్దిగా కట్టుబడి వ్యక్తిగత జీవితంలోనూ అసలు సిసలు కమ్యూనిస్టు ఆదర్శాలకు నిలువెత్తు సాక్ష్యంగా నిలిచారనీ, పార్లమెంటుకు సైతం సైకిల్ పై వెళ్ళి రాజకీయాల్లో నైతికతకూ, నీతికి ప్రబల నిదర్శనంగా నిలిచారని ఆయన కొనియాడారు. ఆయనకు భారతరత్న అవార్డు దక్కితే కేవలం తెలుగు రాష్ట్రాలకు గర్వకారణంగా ఉంటుందని అన్నారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి చొరవ తీసుకోవాలని కోరారు.

Hits: 4

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *