ap news

టీటీడీ ఈవో ధర్మారెడ్డి కుమారుడు మృతి

కావేరి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి

త్వరలో పెళ్ళి పీటలెక్కాల్సిన టీటీడీ ఈవో ధర్మారెడ్డి కుమారుడు చంద్రమౌళి (28) మృతిచెందారు. గుండెపోటుతో చెన్నైలోని కావేరి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన బుధవారం ఉదయం 8.30 గంటలకు మృతిచెందినట్టు ఆస్పత్రి ఎగ్జిక్యుటివ్‌ డైరెక్టర్‌, సహ వ్యవస్థాపకులు డాక్టర్‌ అరవిందన్‌ సెల్వరాజ్‌ ప్రకటన విడుదల చేశారు.  టీటీడీఈవో ధర్మారెడ్డి కుమారుడు చంద్రమౌళి (28) మృతిచెందారు. ఆదివారం మధ్యాహ్నం గుండెపోటుకు గురైన ఆయన్ను చెన్నైలోని కావేరి ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ చంద్రమౌళి చనిపోయారు. అతడు కోలుకునేందుకు ఎక్మో సహా ఇతర చికిత్సలు అందించినా ఫలితం లేకపోయిందని డాక్టర్లు తెలిపారు.  చంద్రమౌళికి పారిశ్రామికవేత్త, టీటీడీ చెన్నై స్థానిక సలహామండలి అధ్యక్షుడు ఏజే శేఖర్‌రెడ్డి కుమార్తెతో వివాహం నిశ్చయమైంది. కొన్నిరోజుల క్రితమే నిశ్చితార్థం జరిగింది. జనవరిలో వీరి వివాహం తిరుమలలో జరగాల్సి ఉంది. రెండు కుటుంబాలవారు ఎంతో సంతోషంగా శుభలేఖలు పంచుతున్నతరుణంలో పెళ్ళి పీటలెక్సాల్సిన చంద్రమౌళి చిన్న వయసులో అకాల మృత్యువుకు గురికావటంలో రెండు కుటుంబాల్లో తీరని విషాదం నింపింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *