gunturu

ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీ హ్యాకథాన్ పోటీలు

పోస్టర్ ఆవిష్కరించిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి

ఆంధ్రప్రదేశ్‌లోని ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీ హ్యాకథాన్ పోటీలు నిర్వహిస్తోంది. దేశ నలుమూలల నుంచి కోడింగ్ పట్ల ఆసక్తిగల విద్యార్థులు ఎవరైనా ఈ కాంపిటిషన్‌లో పాల్గొనవచ్చు. ఈ పోటీలో టాప్ స్కోర్ సాధించిన వారికి ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీలో అడ్మిషన్ లభిస్తుంది. వారికి నచ్చిన కోర్సు ఎంచుకోవచ్చు. ట్యూషన్‌ ఫీజుపై 100 శాతం వరకు స్కాలర్‌షిప్ లభిస్తుంది. అలాగే రూ.లక్ష విలువ చేసే బహుమతులు అందుకోవచ్చు. నేషనల్ టాలెంట్ హంట్ పేరుతో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌ను మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి ఏపీ సచివాలయంలో ఆవిష్కరించారు. ఎస్‌ఆర్ఎం యూనివర్సిటీ సిబ్బంది కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ హ్యాకథాన్‌ను రెండు భాగాలుగా నిర్వహిస్తున్నారు. విద్యార్థులు మొదట మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్‌ (ఎంసీక్యూ) పరీక్షను రాయాల్సి ఉంటుంది. ఇందులో జనరల్ నాలెడ్జ్, జనరల్ అవేర్‌నెస్‌కు సంబంధించిన ప్రశ్నలు ఉంటాయి. రెండో భాగంలో కోడింగ్ నైపుణ్యానికి సంబంధించిన ప్రశ్నలు ఉంటాయి. ఈ రెండు టెస్టులు ఆన్‌లైన్‌లోనే నిర్వహిస్తారు. హ్యాకథాన్ పోటీ రిజిస్ట్రేషన్ డిసెంబర్ 13న ప్రారంభమైంది. జనవరి 31 వరకు కొనసాగుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *