చంద్రబాబు సభలో అపశృతి..7 గురు టిడిపి కార్యకర్తలు మృతి
నెల్లూరు జిల్లా కందుకూరులో బుధవారం రాత్రి చంద్రబాబునాయుడు నిర్వహించిన రోడ్ షో మీటింగ్ లో అపశృతి చోటుచేసుకుంది. సభకు హాజరయిన కార్యకర్తల మధ్య తోపులాట జరగటంతో ఏడుగురు కార్యకర్తలకు పైగా డ్రైనేజిలో పడి ఊపిరాడక మృతి చెందారు. దీంతో చంద్రబాబు సభను నిలిపివేసి హుటాహుటిని ఆసుపత్రికి వెళ్ళారు. మృతుల కుటుంబాలకు రూ 10 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించారు.

UPDATE NEWS..
కందుకూరులో ఒకరు ఊపిరి ఆడక ఒకరు, సైడు కాలువలో పడి మరొకరు, అపస్మారక స్ధితిలో ఉన్న మరో ఐదుగు మృతి చెందారు.. మృతులు గుడ్లూరు మండలం అమ్మవారిపాలెం చినకొండయ్య. కందుకూరు పట్టణం గుర్రంవారి పాలెంకు చెందిన కాకుమాని రాజాగా గుర్తించారు..మిగిలిన వారి వివరాలు తెలియాల్సి ఉంది.