ap news

తెలుగుదేశం కుటుంబ సారధులొస్తున్నారు..

ప్రతి 30 కుటుంబాలకు ఒక సాధికార సారథి

ఎన్నికల వేళ.. తెలుగుదేశం పార్టీ కీలక నిర్ణయం

రాష్ట్రం లో ప్రజలకు మరింత చేరువ అయ్యేందుకు టీడీపీ ఒక కొత్త విభాగాన్ని ఏర్పాటు చేస్తోంది. ప్రజలకు మరింత అండగా నిలబడేందుకు, ప్రజాసమస్యలపై తక్షణమే స్పందించేందకు తెలుగుదేశం పార్టీ ఆధర్వర్యంలో కుటుంబ సాధికార సారధి నియమకం చేపట్టింది. రాష్ట్రంలో ఇక ప్రతి 30 కుటుంబాలకు ఒక కుటుంబ సాధికార సారధి ఉంటారు. వీరు తెలుగుదేశం పార్టీ విధానపరమైన నిర్ణయాలను వారి పరిధిలోని కుటుంబాలకు తెలియజేయడంతో పాటు పార్టీ కార్యక్రమాలు, భవిష్యత్ అంశాల గురించి సమాచారాన్ని ఎప్పటికప్పుడు ప్రజలకు అందిస్తున్నారు. నియోజకవర్గానికి 2,500 నుండి 3,000 మంది సాధికార సారథులు ఉంటారు. ఈ నియమాకాల్లో 50 శాతం మహిళలకు అవకాశం కల్పిస్తారు. ప్రతి ఇంటికి వెళ్లి ప్రజా సమస్యలను తెలుసుకొని డిజిటల్ రూపంలో డేటాను సేకరిస్తారు. అంతే కాకుండా ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను పార్టీ దృష్టికి తీసుకు వెళ్తారు. క్షేత్ర స్థాయి ప్రజా సమస్యలు తెలుసు కోవడం ద్వారా సూక్ష్మ స్థాయి మ్యానిఫెస్టో రూపకల్పనకు ప్రణాళికలు రూపొందిస్తారు. పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత కుటుంబ సాధిత సారధి వారి పరిధిలోని కుటుంబాల ప్రగతికి అవసరమైన చర్యలు తీసుకునేలా పని చేస్తారు. బూత్ లెవల్ లో ప్రతి ఇంటికి ఈ సారధులు వారధులుగా పని చేస్తారు. పార్టీలో ఉన్న సెక్షన్ ఇన్‌చార్జ్‌లు అందరినీ కుటుంబ సాధికార సారథులుగా పిలుస్తారు. అవసరమైన చోట్ల నియామకాలు చేపట్టి బాధ్యతలు అప్పగిస్తారు.

ప్రతి నియోజకవర్గంలో కుటుంబ సాధికార సారథి విభాగం ఉంటుంది. పార్టీ కి ప్రజలకు మధ్య మరింత అనుసంధానం కోసం ఈ విభాగం పని చేస్తుంది. ఇప్పటికే పార్టీ స్ట్రక్చర్ లో ప్రతి 25 వేల ఓట్లకు ఒక క్లస్టర్ ఇన్‌చార్జ్‌ని, 5 వెేలకు ఓట్లకు ఒక యునిట్ ఇన్‌చార్జ్‌ని, 1000 ఓట్లకు బూత్ ఇన్‌చార్జ్‌ని నియమించడం జరిగింది. ఇక నుంచి ప్రతి 30 కుటుంబాలకు ఓ కుటుంబ సాధికార సారథి ని టీడీపీ నియమిస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *