విశాఖ చేరుకున్న పవన్
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ శుక్రవారం సాయంత్ర విశాఖపట్నం చేరుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీతో ఆయన భేటీ కానున్నారు. విశాఖ ఎయిర్ పోర్టులో పవన్ కు పార్టీ నేతలు ఘనస్వాగతం పలికారు. పవన్ వెంట జనసేన పొలిటికల్ అఫైర్స్ కమిటీ (పీఏసీ) చైర్మన్ నాదెండ్ల మనోహర్ కూడా ఉన్నారు. పవన్ కు స్వాగతం పలికిన వారిలో పార్టీ పీఏసీ సభ్యులు కోన తాతారావు, ప్రధాన కార్యదర్శి టి. శివశంకర్ తదితరులు ఉన్నారు. ప్రధానితో పవన్ కళ్యాణ్ భేటీ రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రధాన పర్యటన కార్యక్రమాలన్నిటినీ అన్నీ తామై చూసుకుంటున్న తరుణంలో ప్రధాని నుంచి పవన్ కు పిలుపురావటం వైసీపీలో చర్చనీయాంశంగా మారింది.
