శ్రీవెంకటేశ్వర భక్తి ఛానల్ సలహాదారుగా మంగ్లీ
శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ సలహాదారుగా గా ప్రముఖ సింగర్ మంగ్లీని ఏపీ ప్రభుత్వం నియమించింది. జానపద గాయనిగా, సినీ గాయనిగా మంగ్లీకి మంచి గుర్తింపు ఉంది. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై రాసిన పాటలను కూడా గతంలో మంగ్లీ పాడి మెప్పించింది.
