కృష్ణపట్నం పవర్ ప్రాజెక్టును కాపాడుకుంటాం..
-ఆదానీకి తాకట్టుపెడితే సహించేది లేదు..
-ప్రజల సొమ్మును ధారాదత్తం చేసే అధికారం ప్రభుత్వానికి లేదు
-పవర్ ప్రాజెక్టును కాపాడుకునేందుకు దేనికైనా సిద్ధం
-టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు, మాజీ మంత్రివర్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి
ఏపీ ప్రజల సొత్తయిన కృష్ణపట్నం పవర్ ప్రాజెక్టును అదానీకి తాకట్టు పెట్టే హక్కు వైసీపీ ప్రభుత్వానికి ఎవరిచ్చారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రశ్నించారు. నెల్లూరు జిల్లాలోని శ్రీ దామోదరం సంజీవయ్య కృష్ణపట్నం ధర్మల్ విద్యుత్ కేంద్రాన్ని ప్రయివేట్ పరం చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించటం పట్ల ఆగ్రహం వ్యక్త చేశారు. నెల్లూరు జిల్లాలోని పవర్ ప్రాజెక్టు వద్ద సోమిరెడ్డి ఆద్వర్యంలో తెలుగుదేశం కార్యాకర్తలు బైఠాయించారు.
సోమిరెడ్డి ఏమన్నారంటే..
సీఎం జగన్మోహన్ రెడ్డి తన స్వార్ధ ప్రయోజనాల కోసం శ్రీ దామోదరం సంజీవయ్య కృష్ణపట్నం ధర్మల్ విద్యుత్ కేంద్రాన్ని ప్రైవేటుకు దారాధత్తం చేస్తామంటే చూస్తూ ఊరుకోం..జెన్ కో ఉద్యోగులకు టీడీపీ, బీజేపీ, జనసేన, వామపక్షాలతో పాటు రాష్ట్ర ప్రజల మద్దతు ఉంది.. మీ వెనుక మేం నిలబడతాం..మీ పోరాటానికి సంపూర్ణ మద్దతిస్తాం..కృష్ణపట్నం పవర్ ప్రాజెక్టును కాపాడుకోవడం కోసం ప్రభుత్వంతో తాడో పేడో తేల్చుకుంటాం
జగన్ రెడ్డి రుణపడివుండాల్సింది అదానీకి కాదు..151 సీట్లతో సీఎంని చేసిన రాష్ట్ర ప్రజలకన్న సంగతి గుర్తెరగాలి..
మొన్న గంగవరం పోర్టు..నిన్న కృష్ణపట్నం పోర్టు..ఇప్పుడు కృష్ణపట్నం థర్మల్ ప్రాజెక్టు..
ప్రతిష్టాత్మక ప్రాజెక్టులన్నింటినీ ఇలా ఒక్కొక్కటిగా ఆదానికి తాకట్టు పెట్టేయడం దుర్మార్గం..బోనస్ గా రాజ్యసభ సీటును ఇస్తారంట..అదానీకే కాదు..ఆయన భార్యకు కూడా రాజ్యసభ సీటు ఇచ్చుకోండి..మాకు అభ్యంతరం లేదు..ప్రతిష్టాత్మక ప్రాజెక్టులను వారికి దారాధత్తం చేయకండి..గత ప్రభుత్వాలు రూ. 21 వేల కోట్లతో ధర్మల్ కేంద్రాన్ని నిర్మిస్తే ఈ రోజు ఒక్క రూపాయి పెట్టుబడి లేకుండా అదానికీ ఇచ్చేస్తారంట..కృష్ణపట్నం ధర్మల్ కేంద్రం పక్కనే ఓడరేవు, రైల్వే లైను ఉన్నాయి..ఇన్ని సౌకర్యాలున్న ప్రాజెక్టును తాకట్టు పెట్టడం అన్యాయం..ధర్మల్ ప్రాజెక్టు, ఓడరేవు కోసం 2006లో 6 వేల ఎకరాల భూమికి అప్పటి కలెక్టర్ రవిచంద్ర రూ.3 లక్షల చొప్పున పరిహారం ఇస్తామన్నారు..ఆ రోజు దానికి నేను ఒప్పుకోకుండా రూ.6 లక్షలకు ఒక్క రూపాయి తగ్గినా పరిహారం మా రైతులకి వద్దని తెగేసి చెప్పాం..దాంతో ప్రభుత్వం దిగిరాక తప్పలేదు
ఏడాది తర్వాత 300 మంది రైతులు నా దగ్గరకు వచ్చి ఈ ప్రాంతంలో భూముల ధరలు భారీగా పెరిగాయని..పరిహారం కూడా పెంచేలా తమకు సహకరించాలని కోరారు..రైతులను అప్పటి సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి దగ్గరికి తీసుకెళ్లి కష్టనష్టాలను వివరిస్తే మొదట కుదరదన్నారు..చివరకు అంగీకరించి మేం నెల్లూరు వచ్చే లోపు పరిహారాన్ని రూ.7.20 లక్షలు ఇచ్చేందుకు ఒప్పుకున్నారు/
కృష్ణపట్నం ధర్మల్ కేంద్రం దేశంలోనే మొట్టమొదటి సూపర్ క్రిటికల్ ధర్మల్ స్టేషన్ అనే విషయాన్ని గుర్తుంచుకోండి
తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి నిర్మిస్తే దాన్ని కొడుకు జగన్మోహన్ రెడ్డి అమ్మేస్తున్నాడు..ఇదెక్కడి న్యాయం
వైఎస్ రాజశేఖర్ రెడ్డి 1600 మెగావాట్లతో మొదటి యూనిట్ ప్రారంభించారు.. రెండో యూనిట్ ను నారా చంద్రబాబు నాయుడు సీఎంగా 800 మెగావాట్ల పెంచి అంతా కలిపి 2400 మెగా యూనిట్లగా చేశారు..మన రాష్ట్రంలో ఉన్న బిటిపిఎస్, ఆర్టీపీపీలను భారతదేశం ప్రపంచ దేశాలతో పారిస్ ఒప్పందంలో పాత టెక్నాలజీతో ఉండే కోల్ బేస్ ధర్మల్ కేంద్రాలను మూసి వేయాల్సి వస్తే కృష్ణపట్నం ధర్మల్ కేంద్రం జోలికి వచ్చే దానికి లేదు… అటువంటి దాన్ని 25 ఏళ్ల పాటు లీజు పేరుతో ఇస్తామని చెప్పడం దురదృష్టకరం..కర్ణాటక, తెలంగాణలో ఉన్న ధర్మల్ కేంద్రాలకు ఓడరేవు సౌలభ్యం లేదు.. బొగ్గు రవాణా చేసుకోవాల్సింది… అలాంటివాటిని వాళ్ల అమ్మటం లేదు
- కెసిఆర్ ప్రభుత్వం ఐదు యూనిట్లలో 4 వేల మెగావాట్ల ధర్మల్ కేంద్రాన్ని నిర్మిస్తుంది.
- కృష్ణపట్నం ధర్మల్ కేంద్రంలో తెలంగాణకు 27 శాతం షేర్ ఉంది.. ఇద్దరు డైరెక్టర్లు ఉన్నారు..
- మనవాళ్లు ఐదు మంది డైరెక్టర్లు ఉంటే వాళ్లేమో ఆదాని కాళ్లు పట్టుకొని పిసుక్కుంటూ అమ్మకానికి పెడుతున్నారు
- తెలంగాణ ఇద్దరు డైరెక్టర్లు మాత్రం అమ్మడానికి లేదు.. అంతగా కావాలంటే మేమే కొనుక్కుంటాం. మేమే దగ్గరుండి నడిపించుకుంటామని సమాధానం చెప్పారు
- ఆదానితో చేతులు కలిపి కృష్ణపట్నం ధర్మల్ కేంద్రాన్ని అమ్మకానికి పెట్టడం దారుణం
- గుడిని, గుడిలోని లింగాన్ని మింగేసిన వాళ్ళని వదిలేసి జేఏసీ నేత గుమ్మడి శ్రీనివాసులుని పట్టుకుని ఉన్నారు
- జేఏసీ నేత గుమ్మడి శ్రీనివాసులుని బదిలీ చేస్తామంటే ఊరుకునేది లేదు.. కృష్ణపట్నం ధర్మల్ కేంద్రం డైరెక్టర్ని నెల్లూరులో అడుగుపెట్టనివ్వo
- ఇక్కడ ఉండే నాయకులు కృష్ణపట్నం ధర్మల్ విద్యుత్ కేంద్రం నుండి వచ్చే బూడిదను కూడా వదిలిపెట్టడం లేదు.. దానిని విదేశాల్లో అమ్ముకుంటున్నారు
- శాసన సభ్యుడు అంటే అధికారం లేనప్పుడు ఒక కూత, అధికారం ఉన్నప్పుడు ఇంకో కూత ఉండకూడదు
- నేను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం చిత్తూరు జిల్లాకు రూ.11 వేల కోట్లతో కండలేరు నుండి నీటిని తీసుకుని వెళ్దామంటే ఆనాడు ఉద్యమాలు చేశాను.. అయినా ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం టెండర్లు పిలిచి ఇచ్చేసింది
- ప్రతిపక్షంలో నిలిచిన మాట పైన చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆ టెండర్లను రద్దు చేయించాను
- ఒక పెద్దమనిషి ఈ ప్రాంతం ప్రజల ఓట్లతో ఎమ్మెల్యేగా గెలిచాడు.. ఆయనకేం తెలుసు… ఇక్కడి రైతుల కష్టాలు, నష్టాలు, రైతులు చేసిన త్యాగాలు.. వాళ్లు ఎవరి కోసం చేశారు మనకోసం, మన రాష్ట్రం కోసం, ఐదు కోట్ల ఆంధ్రుల కోసం అలాంటివారికి అండగా నిలవాల్సిన బాధ్యత ఉంది కదా..
- ఇక్కడి ప్రజలు తమ భూములను, గడ్డను, తమ గ్రామాన్ని వదిలేసి రోడ్డున పడ్డారు.. ఎందుకు మనందరి కోసమే కదా
- కృష్ణపట్నం ధర్మల్ విద్యుత్ కేంద్రంలో పని చేసే వాళ్ళందరూ ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి దగ్గరకు వెళ్లి వారి మొరను చెప్పుకుంటే ఆ పెద్దమనిషి మీరు మీ జీతం గురించే మాట్లాడండి.. అంతేకానీ ప్రభుత్వం చేసిన చెయ్యకపోయినా మీకెందుకు, ఆదాని చేస్తాడు, అంబాని చేస్తాడు మీకు కావాల్సింది జీతాలు అని సమాధానం చెప్పాడు… ఇంతకంటే ఘోరం మరి ఏమైనా ఉందా
- నీతి కోసం, నిజాయితీ కోసం నిన్ను నమ్మి ఒక్కసారి అని ఓట్లు వేసి గెలిపించారు.. నువ్వు ఏం చేసావు వారి సమస్యను గాలికొదిలేశావు
- ఇక్కడి బూడిద, లేబర్ కాంట్రాక్టు, ఓడరేవుకు టోల్ గేటు పెట్టేసి డబ్బులు దోచుకుంటున్నావు
- నీ దోపిడి అంతా ఇంతా కాదు.. గ్రావెల్, మట్టి, ఇసుక దగ్గర్నుంచి అంతా దోచుకుంటూ భారీ ప్యాలెస్ లు నిర్మించుకుంటున్నావు
- రాష్ట్ర ప్రజలకు, రైతులకు, రైతు బిడ్డలకు విద్యుత్ ఇచ్చే ప్రాజెక్ట్ ను అమ్మ తామంటే మేము ఒప్పుకునేది లేదు
- సీఎం దగ్గరకు వెళ్లి ఈ ప్రాంత ప్రజల సమస్యలు, వారి కష్టాలు, నష్టాలు, వారికి జరుగుతున్న అన్యాయాన్ని అడిగే దమ్ము నీకుందా
- ఎందుకంటే నీకు మంత్రి పదవి కావాలా.. కాళ్లు పట్టుకుని పిసుక్కో వాలా… జనం కోసం మాత్రం కాదు.. ఇంత నిర్లక్ష్యం చూపించే ఎమ్మెల్యేను నేను ఎన్నడూ చూడలేదు
- కృష్ణపట్నం ధర్మల్ కేంద్రం అసోసియేషన్ నీ దగ్గరకు వస్తే ప్రయత్నిద్దామని చెప్పు… మీ తాత సొత్తు ఏమైనా పోతుందా… ఆ తర్వాత సరే నీ సంగతి అందరికీ తెలిసిందేలే
- కృష్ణపట్నం ధర్మల్ కేంద్రాన్ని ప్రైవేటీకరణ చేస్తే మేమందరం కలిసి పోరాడేందుకు సిద్ధంగా ఉన్నాం.. అవసరమైతే దేనికైనా సిద్ధం
ఈ కార్యక్రమంలో జాతీయ ప్రధాన కార్యదర్శి బీదా రవిచంద్ర, నెల్లూరు జిల్లా పార్లమెంట్ అద్యక్షులు షేక్ అబ్దుల్ అజీజ్, రాష్ట్ర కార్యదర్శి బొమ్మీ సురేంద్ర, రాష్ట్ర కార్య నిర్వాహక కార్యదర్శి పెళ్లకూరు శ్రీనివాసులురెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి చేజర్ల వెంకటేశ్వర్లు రెడ్డి , రైతు విభాగం అధ్యక్షులు రాధా కృష్ణమ నాయుడు, మండల పార్టీ అధ్యక్షులు రామ్మోహన్ రెడ్డి, సురేష్ రెడ్డి,రాజా యాదవ్, గాలి రామకృష్ణా రెడ్డి, మస్తాన్ బాబు,తాళ్ళపాక అనురాధ, ముప్పాళ్ళ విజేత రెడ్డి, చెంచల బాబు యాదవ్, జెన్ని రమణయ్య, సర్వేపల్లి నియోజక వర్గ యువత అధ్యక్షలు రాజా గౌడ్, మండల యువత అధ్యక్షలు మునిరెడ్డి, మల్లికార్జున యాదవ్, కొదందయ్య, మాజీ కార్పరేటర్లు మామిడాల మధు, మేకల రామమూర్తి, పొత్తూరు శైలజ, పార్టీ నాయకులు, కార్యకర్తలు, జెన్కో ఉద్యోగులు, కార్మికులు పాల్గోన్నారు.