నర్సరీ రైతులు సాంకేతిక శిక్షణ పొందాలి
నర్సరీ రైతులు ఆధునిక సాంకేతికతను అందిపుచ్ఛకోవాలని ఆంధ్రప్రదేశ్ నర్సరీ గ్రోయర్సు అసోసియేషన్ అధ్యక్షులు జి రవీంధ్రపేర్కొన్నారు. అసోసియేషన్ ఆధ్వర్యంలో చేపట్టిన పూనేకు విజ్ఞానయాత్ర లోభాగంగా జరిగిన సాంకేతిక శిక్షణలో ఆయన ప్రసంగించారు. పూనే విజ్ఞాన యాత్రలో మొదటి రోజు రైజ్ ఎన్ షైన్ బయోటెక్ కంపనీని సందర్శించారు. ఈ సందర్భంగా కంపెనీలో టీష్యూ కల్చర్ మొక్కలతయారీ విధానాన్ని నర్సరీ రైతులకు పరిచయం చేశారు. మధ్యాహ్నం జరిగిన సాంకేతిక శిక్షణ లో జరెబ్రా , వైడ్రెంజియా , యాంథూరియం , ఆగ్లోనీవంటి సుమారు 20రకాల నర్సరీ మొక్కల పెంపకంలో మెళుకువలు సైంటిస్ట్ ఉదయపాటిల్ వివరించారు. ప్రపంచవ్యాప్తంగా వస్తున్న కొత్తసాంకేతిక పరిజ్ఞానాన్ని వివరించారు. ఈ పర్యటనకు ఆంధ్రప్రదేశ్ నుంచి సుమారు 32మంది నర్సరీ రైతులు పాల్గొన్నారు.ఈ బృందానికి ఆంధ్రప్రదేశ్ నర్సరీ గ్రోయర్సు అసోసియేషన్ అధ్యక్షులు రవీంధ్ర నాయకత్వం వహించారు.ఈ యాత్ర మూడు రోజులు కొనసాగుతుంది. ఈ యాత్రలో ఉపాధ్యక్షులు సంజీవరెడ్డి, కార్యదర్శి చలపతిరావు, సమన్వయకర్త శ్రీనివాస్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కిరణ్ కుమార్ 30మంది నర్సరీ నిర్వాహకులు పాల్గొన్నారు.