బూస్టరు డోసు వ్యవధి తగ్గింపు
బూస్టర్ డోసు వ్వవధిని తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రెండవ డోసు వ్యాక్సిన్ తరువాత బూస్టరు డోసు తీసుకునేందుకు ఇంతకు ముందు 9 నెలల వ్యవధి ఉండగా ఇపుడు దానిని 6 నెలలకు తగ్గిస్తూ అధికారిక ప్రకటన చేసింది. నేషనల్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ ఇన్ ఇమ్మూనైజేషన్ (ఎన్టీఏజీఐ) సిఫారసుల మేరకు కొవిడ్ రాకుండా తీసుకునే ముందస్తు వ్యాక్సిన్ వ్యవధిని తగ్గించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వాలకు సమాచారం పంపించిన కేంద్రం అవసరమైన మేరకు బూస్టరు డోసులు అందుబాటులో ఉండేలా తగిన చర్యలు తీసుకోవాలని కోరింది.