చరిత్రలో ఈరోజు..సెప్టెంబరు 4
- జననాలు
- 1825: దాదాభాయ్ నౌరోజీ, భారతీయ పార్సీ పండితులు, వ్యాపారవేత్త, రాజకీయ నాయకులు, పార్లమెంటులో లిబరల్ పార్టీ సభ్యులు. (మ.1917)
- 1890: భూపేంద్రనాథ్ దత్తా, భారతీయ విప్లవకారులు, సామాజిక మరియు మానవ శాస్త్రవేత్త.
- 1909: బ్రజ్ కుమార్ నెహ్రూ, భారతీయ దౌత్యవేత్త, యునైటెడ్ స్టేట్స్‌లో భారత రాయబారి.
- 1923: రామ్ కిషోర్ శుక్లా, రాజకీయ నాయకులు, భారత స్వాతంత్ర్య సమరయోధులు.
- 1924: ఎస్.కె. రామచంద్రరావు, రచయిత, సంస్కృత పండితులు, మనస్తత్వశాస్త్ర ప్రొఫెసర్.
- 1924: కె.వి.రఘునాథరెడ్డి, రాజకీయ నాయకులు. మాజీ కేంద్ర మంత్రితో పాటుగా త్రిపుర, పశ్చిమ బెంగాల్, ఒడిశా రాష్ట్రాలకు గవర్నరుగా పనిచేశారు. (మ.2002)
- 1935: కొమ్మూరి వేణుగోపాలరావు, తెలుగు రచయిత. (మ.2004)
- 1941: సుశీల్ కుమార్ షిండే, భారతీయ రాజకీయ నాయకులు.
- 1945: మోహన్ జోషి, భారతీయ చలనచిత్ర, టెలివిజన్ మరియు రంగస్థల నటులు.
- 1948: అనంత్ నాగ్, కన్నడ సినిమా సినీ నటులు.
- 1948: పర్బత్‌భాయ్ పటేల్, గుజరాత్‌లోని బనస్కాంత నియోజకవర్గం నుండి 16వ లోక్‌సభకు పార్లమెంటు సభ్యులు.
- 1952: రిషి కపూర్, భారతీయ చలనచిత్ర నటులు.
- 1957: క్రిషన్ పాల్ గుర్జార్, ప్రస్తుత భారత ప్రభుత్వంలో సామాజిక న్యాయం మరియు సాధికారత రాష్ట్ర మంత్రిగా పనిచేస్తున్నారు.
- 1962: కిరణ్ మోరే భారత క్రికెట్ జట్టుకు మాజీ వికెట్ కీపర్.
- 1964: ఆదేశ్ శ్రీవాస్తవ భారతీయ సంగీత స్వరకర్త, గాయకులు.
- 1972: డెల్నాజ్ ఇరానీ, భారతీయ నటి.
- 1975: వెట్రి మారన్, చలనచిత్ర దర్శకులు, స్క్రీన్ రైటర్, తమిళ చలనచిత్ర నిర్మాత.
- 1987: రితు పాతక్, బాలీవుడ్ నేపథ్య గాయని.
- 1989: రాగిణి నంద్వాని, భారతీయ చలనచిత్ర మరియు టెలివిజన్ నటి.
- 1990: అపర్ణా బాజ్‌పాయ్, తమిళం, హిందీ మరియు మలయాళం చిత్రాలలో నటించిన భారతీయ చలనచిత్ర నటి.
- మరణాలు
- 1965: ఆల్బర్ట్ స్విట్జర్, ఉత్తమ సేవాదృక్పథం కలిగిన వైద్య నిపుణులు, నోబెల్ బహుమతి గ్రహీత. (జ.1875).
- 1987: రూప్ కన్వర్, రాజస్థాన్‌లోని సికర్ జిల్లా డియోరాలా గ్రామంలో సజీవ దహనం చేయబడిన రాజ్‌పుత్ మహిళ.
- 1997: ధరమ్వీర్ భారతి, హిందీ కవి, నాటక రచయిత.
- 1999: చదలవాడ ఉమేశ్ చంద్ర, ఆంధ్రప్రదేశ్ కి చెందిన పోలీస్ ఉన్నతోద్యోగి. (జ.1966)
- 2000: ముక్రి, హిందీ చిత్రాలలో హాస్యనటులుగా పనిచేసిన చలనచిత్ర నటులు.
- 2006: స్టీవ్ ఇర్విన్, రిస్క్-టేకింగ్ హోస్ట్‌గా ప్రపంచవ్యాప్తంగా కీర్తిని సాధించిన ఆస్ట్రేలియన్ వన్యప్రాణి సంరక్షకులు. ది క్రోకోడైల్ హంటర్ (1992-2006) టీవీ సిరీస్ మరియు సంబంధిత డాక్యుమెంటరీలు తీసేవారు. విషపూరితమైన బుల్ స్టింగ్రే చేత చంపబడ్డారు.
- 2007: భమిడిపాటి రాధాకృష్ణ, నాటక, సినీ కథా రచయిత, జ్యోతిష శాస్త్ర పండితులు, సంఖ్యాశాస్త్ర నిపుణులు, హస్య రచయిత. (జ.1929)
- 2007: వై.రుక్మిణి, తెలుగు, తమిళ, హిందీ నటి.
- సంఘటనలు
- 925: వెస్ట్ సాక్సన్స్ రాజు అథెల్స్టాన్, ఇంగ్లండ్ మొత్తాన్ని పాలించిన మొదటి రాజు అయ్యారు.
- 1781: అనేరికాలో లాస్ ఏంజిల్స్ నగరం స్థాపించబడిన రోజు. ఇప్పుడు యూఎస్ లో అత్యధిక జనాభా కలిగిన రెండవ నగరం మరియు హాలీవుడ్‌కు నిలయం.
- 1833: బార్నీ ఫ్లాహెర్టీ – న్యూయార్క్ సన్ అనే పత్రిక సంస్థ, మొట్టమొదటి సరిగా న్యూస్ పవర్ బాయ్ అనగా దినపత్రికలు ఇంటికి పంచే ప్రక్రియను మొదలుపెట్టిన రోజు. కావున, ఇదే రోజుని, “పేపర్ బాయ్స్” అందరూ “ప్రపంచ పేపర్ బాయ్స్ రోజు”గా జరుపుకుంటారు.
- 1866: మొదటి హవాయిన్ దినపత్రిక ప్రచురణ మొదలు పెట్టారు.
- 1870: తమ రాజును, పదవి నుంచి తొలగించినట్లు, 3వ ప్రెంచి రిపబ్లిక్ ప్రకటించింది.
- 1882: విద్యుత్ కాంతులు వెలిగిన మొట్టమొదటి జిల్లా న్యూయార్క్. ఎక్కడంటే, న్యూయార్క్ లోని పెరల్ స్ట్రీట్ స్టేషను.
- 1885: న్యూయార్క్ సిటీలో, మొట్టమొదటి “కేఫ్టీరియ”ను ప్రారంభించారు.
- 1888: జార్జ్ ఈస్ట్‌మెన్ తన మొదటి “రోల్ ఫిల్మ్” కెమెరాకు పేటెంటు తీసుకుని, కోడక్ సంస్థను రిజిస్టర్ చేసారు.
- 1888: మహాత్మా గాంధీ తన బార్-ఎట్-లా కోసం ఇంగ్లాండ్ బయలుదేరారు.
- 1933: మొదటిసారిగా విమానం గంటకి 300 మైళ్ళ అనగా 483 కి.మీ వేగాన్ని దాటి ప్రయాణించింది. ఈ విమానాన్ని నడిపిన పైలట్లు పేర్లు జె.ఆర్.వెండెల్, గ్లెన్‌వ్యూ Il.
- 1967: భారతదేశంలోని కొయ్‌నా డాం దగ్గర జరిగిన భూకంపం (6.5 రెక్టర్ స్కేలు) వలన 200 మంది చనిపోయారు.
- 1972: అమెరికన్ స్విమ్మర్ మార్క్ స్పిట్జ్ మ్యూనిచ్ ఒలింపిక్ క్రీడలలో తన ఏడవ బంగారు పతకాన్ని గెలుచుకున్నారు.
- 1979: ఇంగ్లండ్ లోని “ది ఓవల్” స్టేడియంలో ఇంగ్లాండ్ క్రికెట్ జట్టుపై భారత్ క్రికెటర్ సునీల్ గవాస్కర్ టెస్ట్ క్రికెట్‌లో తన మూడవ డబుల్ సెంచరీని (221) సాధించారు. అయితే ఇంగ్లండ్‌పై గెలవడానికి భారత్‌కు 438 పరుగులు అవసరం, ఆట 8-429తో ముగిసింది. దీనితో భారత్-ఇంగ్లండ్ మధ్య జరిగిన 4వ టెస్ట్ డ్రాగా మిగిసింది.
1989: నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ (NASA) మరియు యూఎస్ వైమానిక దళం చివరి టైటాన్ III రాకెట్‌ను ప్రయోగించాయి.
1998: అమెరికన్ సెర్చ్ ఇంజన్ కంపెనీ గూగుల్ సంస్థ వ్యవస్థాపకులు సెర్గీ బ్రిన్ మరియు లారీ పేజ్ కలిసి ఇన్ఫర్మేషన్ పత్రాలను దాఖలు చేయడంతో అధికారికంగా స్థాపించబడింది.
2002: అమెరికన్ గాయకులు, కెల్లీ క్లార్క్సన్ రియాలిటీ టెలివిజన్ సిరీస్ అమెరికన్ ఐడల్ యొక్క మొదటి విజేత అయ్యారు.
2009: కొణిజేటి రోశయ్య, ఆంధ్రప్రదేశ్ 21వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు
2016: ఆర్డర్ ఆఫ్ మిషనరీస్ ఆఫ్ ఛారిటీ వ్యవస్థాపకురాలు మరియు 1979లో నోబెల్ శాంతి బహుమతి విజేత అయిన మదర్ థెరిసాను పోప్ ఫ్రాన్సిస్ I చేత కాననైజ్ చేశారు.
నేడు ప్రపంచ పేపర్ బాయ్ దినోత్సవం
తొలి పేపర్ బాయ్‌గా గుర్తింపు పొందిన బార్నీ ప్లాహెర్డీ జయంతిని పురస్కరించుకొని ప్రతి ఏటా సెప్టెంబరు 4న అంతర్జాతీయ పేపర్‌బాయ్ దినోత్సవం జరుపుతున్నారు. అసలు పేపర్ బాయ్ గా గుర్తింపు ఎలా వచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాం, అమెరికాలోని న్యూయార్క్‌కు చెందిన బెంజుమన్ న్యూయార్క్‌సన్ పేపర్‌ను విక్రయించేందుకు పేపర్‌బాయ్స్ కోసం మొట్టమొదటిసారిగా ప్రకటనను ప్రచురించింది. ఓ నిరుపేద కుటుంబానికి చెందిన బ్లార్నీ సైహార్డీ అనే పదేళ్ల బాలుడు 1833, సెప్టెంబరు 4వ తేదీన మొట్టమొదటి పేపర్‌బాయ్‌గా విధుల్లో చేరారు. పేపర్‌బాయ్‌గా పాఠకుల హృదయాల్లో స్థానం సంపాదించిన బార్నీ పుట్టినరోజు కూడా సెప్టెంబరు 4 కావడంతో ఆ రోజును పేపర్ బాయ్స్‌డేగా ప్రకటించారు. అమెరికాలోని హ్యూస్టన్‌లో టెక్సాస్ ప్రెస్ అసోసియేషన్ 125వ వార్షికోత్సవం సందర్భంగా బార్నీ గౌరవార్థం 2005లో అతడి కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. నాటి నుంచి పేపర్‌బాయ్స్ డే ప్రాచుర్యంలోకి వచ్చింది. అసలు పేపర్‌బాయ్ పని అంటే.. ఏదో పేపర్లు తీసుకొని ఉదయం ఇళ్ల వద్ద వేసి వెళ్లిపోతారని అనుకుంటారు అంతా. అయితే ఇందులో ఉన్న ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. ఎందరో పాత్రికేయులు రేయింబవళ్లు శ్రమించి సేకరించిన వార్తలను సబ్‌ఎడిటర్లు సరిచేసి ముద్రణ ఆమోదయోగ్యంగా మలుస్తారు. ఆ తర్వాత ముద్రించబడ్డ దిన పత్రికలను పాఠకులకు చేరవేయాల్సిన బాధ్యత పేపర్‌బాయ్‌లదే. తెల్లవారు జామున 3.30 గంటలకు ముందే పేపర్‌బాయ్‌లు నిద్రలేచి సైకిల్‌పై బయలుదేరి పేపర్ కట్టలు వచ్చే పాయింట్లకు చేరుకుంటారు. దినపత్రికలను సర్దుకున్నాక పై అంతస్థులో ఉన్న ఇళ్లకు పేపర్‌ను ఎగర వేసేందుకు తాడుతోనూ, పేపర్‌నే పొట్లంగా మలిచి ఆ కట్టలను సైకిల్‌పై సర్దుకుని బయలు దేరుతారు. తమ ఖాతాదారులకు పత్రికలు వేసుకుంటూ ముందుకు సాగిపోతారు. పేపర్ వేసే క్రమంలో సైకిల్ లేదా ద్విచక్ర వాహనం మరమత్తులకు గురవడం, ఆరోగ్యం బాగలేక నిద్రలేవడం ఆలస్యమైతే ఇక తిట్ల దండకాలే. బిల్లులు సకాలంలో వసూలు చేయకపోతే ఏజెంట్లు జీతాలు ఇవ్వడంలో ఇబ్బందులకు గురిచేయడం ఇలా చాలా బాధలే ఉన్నాయి. మన భారతదేశంలో చాలా మంది ప్రముఖులు ఒకప్పుడు పేపర్ బాయ్ గా చేసినవారే, ఇప్పుడు వారెవరో తెలుసుకుందాం, కోట్లాది మంది హృదయాల్లో చెరగని ముద్ర వేసిన దివంగత భారత రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం విద్యార్థి దశలో పేపర్‌బాయ్‌గా పని చేశారు. ఆయన విద్యార్థి దశలో పుస్తకాల ఖర్చుల కోసం తెల్లవారుజామునే లేచి ఇంటింటా పేపరు వేసేవారు. ఇక ప్రఖ్యాత జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత రాపూరి భరద్వాజ కూడా పేపర్‌బాయ్‌గా పని చేశారు. స్వాతంత్రోద్యమం ఉవ్వెత్తున జరుగుతున్న రోజుల్లో బాలగంగాధర్ తిలక్ సైతం పీపుల్స్‌వార్ పత్రికకు కొన్నాళ్లపాటు పేపర్‌బాయ్‌గా పనిచేశారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎందరో మహనీయులు, మహానుబావులు పేపర్‌బాయ్‌లుగా పనిచేసిన వారే. కాబట్టి, పేపర్ బాయ్స్ అందరికి మరొక్కసారి ప్రపంచ పేపర్ బాయ్ రోజు శుభాకాంక్షలు తెలుపుకుందాం.