వచ్చే నెలలో తెలుగు అకాడమీ విభజన
వచ్చే నెల మొదటి వారంలోపు తెలుగు, సంస్కృత అకాడమీ రూపు దాలుస్తుందని అకాడమీ చైర్ పర్సన్ నందమూరి లక్ష్మీ పార్వతి తెలిపారు. విజయవాడలో మంగళవారం ఇంటర్మీడియట్ పాఠ్య పుస్తకాలను విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ తో కలిసి ఆమె ఆవిష్కరించారు.పోటీ పరీక్షలు, డిగ్రీ, పీజీ పుస్తకాలను కూడా తెలుగు అకాడమీ ముద్రిస్తోందనీ, త్వరలో వాటిని కూడా ఆవిష్కరించనున్నట్టు తెలిపారు. తెలుగు అకాడమీ ముద్రించే పుస్తకాలపై విద్యార్ధులలో మక్కువ ఎక్కువగా ఉంటుందనీ. పుస్తకాలలో నాణ్యత ఉంటుందన్న నమ్మకాన్ని అకాడమీ నిలబెడుతుందన్నారు. సీఎం వైఎస్ జగన్ సూచనలకి అనుగుణంగా తెలుగు, సంస్కృత అకాడమీని తీర్చుదిద్దుతున్నామనీ, అకాడమీ విభజనపై ఎపికి అనుకూల మైన తీర్పు వచ్చిందన్నారు. ఆవిష్కరణ సభలో మంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ తెలుగు అకాడమీని గత ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసిందన్నారు. తమం ప్రభుత్వం వచ్చాకే తెలుగు అకాడమీని ప్రారంభించాం. భాషాభివృద్దికి కృషి చేసేందుకే తెలుగు, సంస్కృతి అకాడమీగా మార్పు చేసినట్టు తెలిపారు. ఈ సమావేశంలో ఉన్నత విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి సతీష్‌చంద్ర, అకాడమి చైర్పర్సన్ సంచాలకులు వి. రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.