ప్రధాని మోడీ విశాఖ పర్యటన
ఏర్పాట్లు పరిశీలించిన విజయసాయిరెడ్డి, వై.వి సుబ్బారెడ్డి
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈనెల 11, 12 తేదీల్లో విశాఖ నగరంలో పర్యటిస్తున్నారు. పర్యటనలో భాగంగా 12వ తేదీన ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో బహిరంగ సభలో ప్రధానమంత్రి పాల్గొంటారు. దీనిలో భాగంగా మైదానంలో అవసరమైన మరమ్మత్తులను అధికారులు చేపడుతున్నారు. దీని కారణంగా ఆది, సోమవారాలలో మద్దిలపాలెం కూడలి నుంచి మూడవ పట్టణ పోలీస్ స్టేషన్ కు వెళ్లే రహదారిని తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ మహమ్మద్ ఖాన్ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు ప్రత్యామ్నాయ మార్గాలలో ప్రయాణించి, తమకు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.