హత్యపై సిఎం ఆరా
శ్రీకాకుళం జిల్లా గార మండలం ఉపాధ్యక్షులు బరాటం రామశేషు హత్యఘటనపై రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆరా తీశారు. ఈ మేరకు రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావుతో మాట్లాడి హతుని కుటుంబానికి అండగా ఉండాలన్నారు. తక్షణమే గ్రామానికి వెళ్లి ఘటనపై పూర్తి వివరాలు తెలుసుకోవడంతో పాటు రామశేషు కుటుంబానికి అండగా నిలబడాలని ఆదేశించారు. దీంతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయవాడలో నిర్వహిస్తున్న బీసీ సదస్సుకు హాజరు కాకుండానే… పార్టీకి ఎన్నో సేవలందించి హత్యకు గురైన రామశేషు కుటుంబాన్ని పరామర్శించడానికి రెవెన్యూశాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు వెళ్లారు.