జానుడి ఆధ్వర్యంలో 18న సాహిత్య సదస్సు
మల్లవరపు జాన్ మధుర సాహిత్య భారతి సౌజన్యంతో సెంటర్ ఫర్ లిటరేచర్ అండ్ ఆర్ట్స్ జానుడి సంస్థ కధాత్మక సంవేదన-2022 పేరుతో ఈ నెల 18 ఆదివారం సాహిత్య సదస్సు నిర్వహించనుంది. ఒంగోలులోని శ్రీనగర్ 1వ లైనులో ఉన్న డాక్టర్ మల్లవరపు రాజేశ్వరరావు భవన్ లో నిర్వహించనున్న సదస్సులో మోహన్ తలారి రాసిన హాస్టల్ లైఫ్, ఇండస్ మార్టిన్ రాసిన పాదరి గారి అబ్బాయి, తాడి ప్రకాష్ రచించిన ఏలూరు రోడ్, డాక్టర్ విజయరామరాజు రచించిన సృష్టిలో తీయనిది, కొమ్ము రజిత రాసిన దళిత్ డైరీస్, దుగ్గినపల్లి ఎజ్రాశాస్త్రి రాసిన చంద్రవంక, ఆచార్య విప్తాలి శంకరరావు రచించిన తడి ఆరని బతుకులు, చిలుకూరి రామ ఉమామహేశ్వర శర్మ రాసిన నేనూ శాంత కూడా, డాక్టర్ నాగసూరి వేణుగోపాల్ రాసిన వేణునాదం, దారా గోపి రాసిన గుడెసె ఏసోబు, సోలోమోన్ విజయ్ కుమార్ రచించిన మునికాంతంపల్లి కతలు, డాక్టర్ సిద్ద లింగయ్య రాసిన ఊరు-వాడ రచనలపై సమీక్ష నిర్వహించనున్నారు. పుస్తకావిష్కరణలతో పాటు విద్యార్ధులకు క్విజ్ పోటీలు నిర్వహించనున్నారు. సాహిత్యాభిమానులు వచ్చి సదస్సును విజయవంతం చేయాల్సిందిగా జానుడి నిర్వాహకులు కోరారు.