గుంటూరు బొజ్జా తారకం న్యాయ విజ్ఞాన కేంద్రం
ప్రారంభించిన డీబీఎఫ్ వ్యవస్థాపక అధ్యక్షుడు కొరివి వినయకుమార్
అమరావతి, ఆంధ్రప్రభ
గుంటూరులోని దళిత బహుజన ఫ్రంట్ (డీబీఎఫ్) ఆధ్వర్యంలో బొజ్జా తారకం న్యాయ విజ్ఞాన కేంద్రం ఏర్పాటయింది. డీబీఎఫ్ కార్యాలయంలో ఆ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు, హైకోర్టు న్యాయవాది కొరివి వినయకుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలో బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం జీవితాంతం బాసటగా నిలిచిన బొజ్జా తారకం 84వ జయంతి సందర్భంగా న్యాయ విజ్ఞాన కేంద్రాన్ని ప్రారంభిస్తున్నట్టు తెలిపారు. అయిద దశాబ్దాల పాటు బొజ్జా తారకం దళిత, పౌర హక్కుల కోసం పోరాడి అందరికీ స్ఫూర్తిదాయకంగా నిలిచారని అన్నారు. డీబీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు అంగడాల పూర్ణచంద్రరావు, బీసీ సంఘం నేతలు ఉగ్గం సాంబశివరావు, వాల్మీకి శ్రీనివాసరావు, ఉద్యోగ సంఘ నేతలు చెరుకూరి అశోక్ రత్నం, కోడి రెక్క కోటి రత్నం, వసంత కుమార్, డీబీఎఫ్ నేతలు భూపతి సునీల్ కుమార్, చంద్ర నాయక్, వేముల విజయకుమార్, శ్రామిక సంఘం నాయకులు షేక్ నాగూర్ బాబు, అందుకూరి కుమార్, న్యాయవాదులు పొందుగల ప్రకాష్, ఉన్నవ సుధాకర్, గడ్డం పాల్ విజయకుమార్ తదితరులు పాల్గొని బొజ్జతారకంకు నివాళులు అర్పించారు.