దళిత గిరిజన చైతన్య సదస్సులకు తరలి రండి
కారంచేడు, చుండూరు మృతవీరుల సంస్మరణ సభల కరపత్రాన్ని
విడుదల చేసిన భీమ్ భారత్
జులై 17 కారంచేడు సంఘటన రోజు నుండి ఆగస్టు 6 చుండూరు మృతవీరుల సంస్మరణ సభ వరకు దళిత గిరిజనులు ఐక్యత చైతన్య సదస్సులను గ్రామ గ్రామాన జరుపుటకు భీమ్ భారత్ రాష్ట్రవ్యాప్త ప్రచారంలో భాగంగా ఆదివారం పెద కాకాని గ్రామంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద కారంచేడు చుండూరు మృతవీరుల సంస్మరణ సభల కరపత్రాన్ని స్థానిక నాయకులతో కలిసి ఆవిష్కరించడం జరిగింది. భీమ్ భారత రాష్ట్ర అధ్యక్షులు పాగళ్ళ ప్రకాష్ మాట్లాడుతూ రాష్ట్రంలో దళిత బహుజనులు ఎదుర్కొంటున్న సంఘటనపై అనేక విషయాలను చర్చించుకొనుటకు వచ్చేనెల ఆరో తారీఖున గుంటూరులో అంబేద్కర్ భవన్లో సభా కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు ఈ సమావేశానికి రాష్ట్ర నలుమూలల నుండి దళిత గిరిజన ప్రజా సంఘాల ప్రతినిధులు ప్రముఖ న్యాయవాదులు పాల్గొంటారని గత కొంతకాలంగా దళిత దళిత బహుజనులపై జరుగుతున్న అత్యాచారాలు అణిచివేత పై. ప్రభుత్వం నిలుపుదల చేసిన 27 ఎస్సీ ఎస్టీ ప్రభుత్వ పథకాలను. నాలుగేళ్లగా ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను తిరిగి ఎస్సీ ఎస్టీ ప్రజలకు ఖర్చు పెట్టే విధంగా సుదీర్ఘంగా చర్చించి అన్ని పార్టీ ప్రతినిధులకు సభలో చర్చించిన విషయాలను సభలో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం పనితీరుపై తీర్మానాలు ఉంటాయని పాగళ్ళ ప్రకాష్ తెలిపారు భీమ్ భారత్ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ ఎంప్లాయిస్ యూనియన్ నాయకులు అంకం శ్యామ్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ ఉద్యోగులు ప్రభుత్వ పరంగా అణిచివేతకు అవమానాలకు దీర్ఘకాలికంగాఎదుర్కొంటున్న సమస్యలపై మన సమస్యలను మనమే పరిష్కరించుకునే దానికి మన ప్రజలను మనమే చైతన్య పరుచుకోవాలని అంకం శ్యామ్. తెలిపారు కాంగ్రెస్ పార్టీ ఎస్సీ డిపార్ట్మెంట్ నాయకులు ఎలమంద మాట్లాడుతూ అన్ని పార్టీలు రాజకీయంగా ఆర్థికంగా దళిత బహుజనలను అన్ని విధాలుగా మనిషి వేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు పాంప్లేట్ ఆవిష్కరించిన వారిలో భీమ్ భారత జిల్లా నాయకులు నేలం ఆనంద్, తాటిగిరి రాజు, సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.