యువత రాజకీయాల్లోకి రావాలి
విజయవాడలో జేడీ లక్ష్మీనారాయణ ‘అర్ధరాత్రి ఆలోచన’
యువత రాజకీయాల్లోకి రావాలని సిబిఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ పిలుపునిచ్చారు. ధన, కుల, వంశపారంపర్య రాజకీయాలకు స్వస్తి పలకాలన్నారు. బిజయవాడలో గురువారం సాయంత్రం ఐలాపురం కన్వెన్షన్ హాలులో అర్ధరాత్రి ఆలోచన అనే కార్యక్రమాన్ని లక్ష్మీనారాయణ నిర్వహించారు. ప్రజా సంఘాలు, రైతులు, వివిధ వర్గాలకు చెందిన ప్రతినిధులతో రాత్రంతా చర్చలు జరిపారు. అర్థరాత్రి స్వాతంత్ర్యం వచ్చిన దేశంలో ప్రధాన సంఘటనలన్నీ అర్దరాత్రి జరిగాయని జేడీ గర్తు చేసారు. అందుకే అర్ధరాత్రి మేల్కొని సమస్యలు తెలుసుకుంటున్నాని తెలిపారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వాలు లేవని అసహనం వ్యక్తం చేసారు. రాజనీతి శాస్త్రాన్ని రాజకీయ శాస్త్రంగా మార్చి ప్రస్తుత రాజకీయ నాయకులు కుటుంబ పాలనకు పాల్పడుతున్నారన్నారు. ఓటర్లను చైతన్యపరిచి ప్రస్తుత రాజకీయాలను సంస్కరించాల్సిన తరుణమిదని చెప్పారు. పరిపాలన విభాగాల్లో పనిచేస్తున్న అధికారులందరూ అన్ని ఫైళ్లను ఆన్లైన్ ద్వారా వెబ్సైట్లో పెట్టాలని, ప్రజాస్వామ్యంలో ప్రజలే ప్రభువులైనప్పుడు పరిపాలనలో ఏం జరుగుతుందనేది ప్రజలకు తెలియాలన్నారు అంతేకాకుండా అవినీతికి అవకాశం లేని ప్రభుత్వాల ఏర్పాటు చట్టాలు చేయాలన్నారు. మేనిఫెస్టోలను ప్రజలే నేరుగా తయారుచేసి వాటిని అమలు చేయగలిగే నాయకులను ప్రజాప్రతినిధులుగా ఎన్నుకోవాలని కోరారు. భారత రాజకీయ వ్యవస్థలో పలు రకాల మార్పులు రావాల్సిన అవసరం ఉందన్నారు రాజకీయం అంటే యువత అసహ్యించుకుంటుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు కాబట్టి రాజకీయాలను బాగు చేయాలంటే రాజకీయాలలోకి దిగక తప్పదు అన్నారు. తెలంగాణలో కొల్లాపూర్ నియోజక వర్గంలో పోటీ చేసిన శిరీష అనే బర్రెలక్కకు అందుకే తాను మద్దతు పలికానని జేడీ అన్నారు. చేసానన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా కల్పించాల్సిందేనని ఆయన డిమాండ్ చేశారు. జేడీతో భేటీలో జాతీయ గిరిజన ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి, కుంభా ఉదయ్ కుమార్, ప్ కన్వీనర్ పోతిన వెంకట రామారావు, ఆప్ నేత ఫణిరాజ్, ఎస్.వి.ఎస్. లక్ష్మీనారాయణ, ఎకనమిస్ట్ ఏకాంబరం, శర్మ , అంతిమ సంస్కార వేదిక ఛైర్మన్ పులుపుల సాయి, వేద పండితుల బృందాలు తదితరులు పాల్గొన్నారు.