ap news

విద్యార్ధిని ఆత్మహత్యపై దళిత స్త్రీ శక్తి విచారణ

  • డీఎస్ఎస్ జాతీయ కన్వీనర్ గెడ్డం ఝాన్సీ ఆధ్వర్యంలో విచారణ 
  • హాస్టల్ ను సందర్శించిన ఝాన్సీ బృందం
  • ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియ రాలేదు
  • తల్లిదండ్రులు ఉపాధ్యాయులు తోటి విద్యార్థుల నుంచి వివరాల సేకరణ 

 

మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్ మండలం బాలికల హాస్టల్ లో గురువారం పదవ తరగతి విద్యార్థిని కొమ్ము ఆరాధ్య (14) ఆత్మహత్య కు గల కారణాలపై దళిత్ స్త్రీ శక్తి జాతీయ కన్వీనర్ గడ్డం ఝాన్సీ విచారణ చేశారు. డిఎస్ఎస్ కోఆర్డినేటర్స్ బృందంతో కలిసి విద్యార్థిని ఆత్మహత్యకు గల కారణాలను విద్యార్థులను, అధ్యాపకులను, మృతురాలి తల్లిదండ్రులతో మాట్లాడి  తెలుసుకున్నారు. పాఠశాల అధ్యాపకులు సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం.. ఉదయం ఐదు గంటల నుంచి 6.30 గంటల వరకు ఇంగ్లీష్ తరగతి గదిలో పాఠ్యాంశాన్ని విన్న ఆరాధ్య తధనంతరం తన తోటి విద్యార్థులు అల్పాహారం భుజించేందుకు వెళ్లగా.. ఆరాధ్య మాత్రం పాఠశాలలో పనిచేసే ఆయమ్మ శారద చీరను బకెట్లో వేసుకుని ఏడవ తరగతి గదిలోకి వెళ్లి తలుపులు వేసుకొని చీరతో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు పేర్కొన్నారు. కాగా పది అడుగుల ఎత్తులో ఉన్నటువంటి ఇనుప రాడుకు చీరతో వేలాడుతూ కనిపించిందని విద్యార్థులు తెలిపారు. వెంటనే విషయాన్ని విద్యార్థులు అధ్యాపకులకు తెలుపగా హుటాహుటిన వారు వచ్చి కిందికి దించారు. కాగా గురుకులంలో వుండే నర్సు వచ్చి సీపీర్ చేసిన అనంతరం.. వెంటనే షాద్ నగర్ లోని ప్రభుత్వ వైద్యశాలకు తన కారులోనే తరలించినట్లు ఇన్చార్జి ప్రిన్సిపాల్ అంజన్ రెడ్డి తెలిపారు. అయితే అప్పటికే విద్యార్థిని మృతి చెందినట్లు వైద్యలు నిర్ధారించారని పేర్కొన్నారు. విద్యార్థిని ఆత్మహత్యపై దళిత స్త్రీ శక్తి జాతీయ కన్వీనర్ ఝాన్సీ గెడ్డం మాట్లాడుతూ.. విద్యార్థులు ధైర్యంగా ఉండి చదువుకోవాలని సూచించారు. చిన్న చిన్న విషయాలకు మానసికంగా కృంగిపోకుండా చదువుపై దృష్టి పెట్టాలని ఈ సందర్భంగా విద్యార్థులను కోరారు. క్షణికావేశాలకు ఎట్టి పరిస్థితుల్లోనూ లోనుకాకూడదని పేర్కొన్నారు. నేటి బాలలే రేపటి భావి భారత పౌరులని ఈ సందర్భంగా ఆమె గుర్తు చేశారు. అంతేకాకుండా గురుకులాల్లో పెరుగుతున్న ఆత్మహత్యలపై తెలంగాణ ప్రభుత్వం వెంటనే ఒక కమిషన్ ఏర్పాటు చేయాలని ఆమె డిమాండ్ చేశారు.

హాస్టల్ ను సందర్శించిన డీఎస్ఎస్ జాతీయ కన్వీనర్ గెడ్డం ఝాన్సీ ఆధ్వర్యంలోని బృందం
మా బిడ్డకు ఎలాంటి సమస్యలు లేవు

మా బిడ్డకు ఎలాంటి సమస్యలు లేవని, తమ కూతురు ఉరి వేసుకొని చనిపోయేంత పిరికిది కాదని పేర్కొన్నారు. ఇంట్లోనూ స్కూల్లోనూ ఎలాంటి బాధలు లేవని వివరించారు. చదువులో అందరితోపాటు చదివేదని, ఎలాంటి మానసిక సమస్యలు లేవని విలపిస్తూ మృతరాలి తల్లి రజిత తెలిపింది. మరోవైపు అధ్యాపకులు మాట్లాడుతూ అమ్మాయి చాలా సంతోషంగానే ఉండేదని, ఇలాంటి అగైత్యానికి పాల్పడుతుందని తాము ఎవరం ఊహించలేదని కన్నీటి పర్యంతమయ్యారు. తమ పిల్లలను చూసుకున్నట్టే విద్యార్థులను చూసుకునే వాళ్ళమని టీచర్లు తెలిపారు.

Share this News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *