హైదరాబాద్ లో దళిత స్త్రీ శక్తి .. డీఎస్ఎస్ సదస్సు
దళిత స్త్రీ శక్తి (డిఎస్ఎస్) హైదరాబాద్ లో అంబేద్కర్ రీసోర్స్ సెంటర్ లో బుధవారం వార్షిక సవార్షిక సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించింది. సమావేశంలో భాగంగా “దళిత ఆదివాసీ మహిళలపై హింస, మానసిక ఆరోగ్యం: విభిన్న కోణాలు” అనే అంశంపై సదస్సును నిర్వహించింది. సదస్సుకు డీఎస్ఎస్ జాతీయ కన్వీనర్ గెడ్డం ఝాన్సీ అధ్యక్షత వహించారు. తెలంగాణ విద్యా కమిషన్ చైర్ పర్సన్ ఆకునూరి మురళి అధ్యక్షత వహించిన సదస్సులో ప్రొఫెసర్ రామా మెల్కోటే, సీఐడీ ఎస్పీ అనన్య, తెలంగాణ ట్రాన్స్ కో డీఈ బి. మాణిక్యం, జీహెచ్ ఎంసీ సీఎంవో డాక్టర్ పద్మశ్రీ, నర్రా రవికుమార్, డాక్టర్ సంధ్య, డాక్టర్ రాధిక, సైకాలజిస్టులు, డాక్టర్ సిద్దోజి రావు, జమున, జెండర్ స్పెషలిస్ట్ అడ్వా జిడివి ప్రకాష్ లు హాజరయ్యారు. ఈ సందర్భంగా డీఎస్ఎష్ 19వ వార్షిక నివేదికను విడుదల చేశారు. గ్రామాలు, మురికివాడల నుంచి దళిత ఆదివాసీ మహిళలు పెద్ద సంఖ్యలో సమావేశానికి హాజరయ్యారు.
