5న గుంటూరు జిల్లాలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ పర్యటన
విజయవంతం చేయాలని జిల్లా అధ్యక్షుడు తిరుపతిరావు విజ్ఞప్తి
బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ పర్యటనను విజయవంతం చేయాలని పార్టీ జిల్లా అధ్యక్షుడు చెరుకూరి తిరుపతిరావు విజ్ఞప్తి చేశారు. గుంటూరు అరండల్ పేట లోని యోగిభవన్ లో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈనెల 5 ఉదయం నుంచి సాయంత్రం వరకు జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేయనున్న కార్యక్రమాల్లో మాధవ్ పాల్గొంటారని తెలిపారు. 5వ తేదీన ఉదయం 10 గంటలకు చిల్లీస్ రెస్టారెంట్ వద్ద నుండి శ్రీ కన్వెన్షన్ వరకు శోభాయాత్ర పాల్గొంటారు.. అనంతరం శ్రీ కన్వెన్షన్ లో నిర్వహించనున్న పార్టీ విస్తృతస్థాయి కార్యకర్తల సమావేశానికి హాజరవుతారని తిరుపతిరావు తెలిపారు. జిల్లా స్థాయి సమస్యలపై నిర్వహించనున్న సమీక్షా సమావేశంలోనూ, హిందూ ఇంజనీరింగ్ కళాశాలలో నిర్వహించనన్న రాష్ట్ర అర్చక జేఏసీ సమావేశం లో కూడా మాధవ్ పాల్గొననున్నట్టు తెలిపారు. మీడియా సమావేశంలో బిజెపి జిల్లా ఇన్ చార్జి తమనంపూడి రామకృష్ణారెడ్డి, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్సులు భజరంగ్ రామకృష్ణ, తోట శ్రీనివాసరావు, కార్యదర్శి నారాయణరెడ్డి, సీనియర్ నాయకులు వైవి సుబ్బారావు, కుమార్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.