శివుని కంఠాన్ని తాకిన కృష్ణమ్మ
కృష్ణా నది ఉగ్రరూపం దాల్చింది. ఎగువన కురుస్తున్న వర్షాలు కారణంగా నదిలో వరద ఉద్ధృతంగా ప్రవహస్తోంది. దీంతో పల్నాడు జిల్లా కాట్రపాడులోని కృష్ణా నది ఒడ్డున ఉన్న నీలకంఠుడి విగ్రహం కంఠాన్ని తాకుతూ వరద ప్రవహిస్తోంది. ఈ దృశ్యాలను స్థానికులు తమ ఫోన్లలో చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. గతంలో కృష్ణా పుష్కరాల సమయంలో గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు.

