ap news

నిబంధనలు సడలించి ధాన్యం కొనుగోలు చేయాలి

మీడియాతో మాట్లాడుతున్న వడ్డే శోభనాద్రీశ్వరరావు

ఎకరానికి రూ.25వేలు నష్టపరిహారం అందించాలి

 కేంద్ర పరిశీలన బృందానికి రైతు సంఘాల నేతలు విజ్ఞప్తి

కేంద్ర ప్రభుత్వ పరిశీలన  ప్రతినిధి బృందం సోమవారం పునాదిపాడు ప్రాంతంలో పర్యటించింది. మొంథా తుఫాను ప్రభావం వల్ల పంట నష్టపోయిన కౌలురైతులను, రైతులను కేంద్ర బృందం సభ్యులు పరామర్శించారు. పంట పొలాలను పరిశీలించారు. జరిగిన నష్టాన్ని అడిగి తెలుసుకున్నారు.తుఫాను ప్రభావంతో ఎకరానికి కేవలం 10 నుంచి 15 బస్తాల లోపు మాత్రమే దిగుబడి వస్తుందని అంచనాకు పరిశీలకులు వచ్చారు. ఎకరాకు రూ.40 వేలు పెట్టిన పెట్టుబడి కూడా దక్కే పరిస్థితి లేదని బృంద సభ్యులతో రైతులు,కౌలురైతులు వాపోయారు.పెట్టుబడి అసలు, వడ్డీలు కూడా కట్టలేని దయనీయమైన  పరిస్థితని బృందం సభ్యులకి కౌలురైతులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘాల సమన్వయం సమితి రాష్ట్ర కన్వీనర్ వడ్డే శోభనాద్రిశ్వరరావు, రైతు సంఘం సీనియర్ నాయకులు వై. కేశవరావు,ఆంధ్రప్రదేశ్ కౌలురైతుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.జమలయ్య, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు వి. కృష్ణయ్య, ఆంధ్ర ప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు మల్నీడి యలమందారావు, జాగృతి రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మరీదు ప్రసాదు,ఏఐకె ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.వెంకటరెడ్డి,రైతు కూలీ సంఘం రాష్ట్ర నాయకులు యు. వీరబాబు తదిత రైతునేతలు కేంద్ర ప్రభుత్వ పరిశీన బృందానికి వినతిపత్రం అందజేశారు.

తుపాను వల్ల దెబ్బతిన్న పంటను పరిశీలిస్తున్న కేంద్ర బృందం

ఈ సందర్భంగా రైతు నేతలు మాట్లాడుతూ ఎకరానికి మాగాణి రైతులకు రూ. 25,000 చొప్పున, వాణిజ్య పంటలకు రూ.50,000, ఉద్యానవన పంటలకు రూ. 75,000 చొప్పున నష్ట పరిహారం ఇవ్వాలని కోరారు. తుఫాను ప్రభావం వల్ల తడిచిన ధాన్యాన్ని, తప్ప, తాలూ ఉన్న, నూకగా ఉన్న ప్రతిగింజను కూడా  మద్దతు ధరల ప్రకారం కొనుగోలు చేయాలని విజ్ఞప్తి చేశారు.  2005 విపత్తుల చట్టం, సెక్షన్ 11,12, 61ల ప్రకారం నష్టపరిహారం అందించాలన్నారు. ఉచిత పంటల బీమా పథకాన్ని అమలు చేయాలని రైతుల వాటా బీమా ప్రీమియంను రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించాలని కోరారు. ఈ ఏడాది రైతుల,కౌలురైతుల పంట రుణాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.రబీలో సాగు చేసే పంటలకు రుణ సదుపాయం కల్పించాలని కోరారు. నూటికి 90శాతం కౌలు రైతులు సాగు చేస్తున్నారని, పంట నష్టపరిహారం,కౌలు రైతులకు నేరుగా అందజేయాలని  విజ్ఞప్తి చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *