నేడు జగనన్న విద్యాదీవెన
- 11.03 లక్షల మంది విద్యార్ధులకు
- రూ 686 కోట్ల చెల్లింపులు
- కంప్యూటర్ బటన్ నొక్కి..
- తల్లుల ఖాతాలో జమచేయనున్న సీఎం జగన్
జగనన్న విద్యాదీవెన పథకం కింద ఈనెల 30 మంగళవారం ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీ, ఇంజనీరింగ్, మెడిసిన్ కోర్సులు చదివే అర్హతగల విద్యార్ధులకు రాష్ట్ర ప్రభుత్వం మూడో విడత త్రైమాసిక ఫీజు చెల్లించనుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి కంప్యూటర్ బటన్ నొక్కి 11.03 లక్షల మందికి విద్యార్ధులకు వారి తల్లుల బ్యాంకు ఖాతాల్లో రూ 686 కోట్లను జమ చేయనున్నారు. విద్యార్ధుల ఫీజు మొత్తాన్ని తిరిగి చెల్లించే ప్రాతిపదికన జగనన్న విద్యాదీవెన పథకాన్ని అమలు చేస్తున్నారు. ఈ పథకం తొలి త్రైమాసిక ఫీజును ఏప్రిల్ 19న, రెండవ విడతను జులై 29న చెల్లించారు. మూడవ విడతను ఈనెల 30 చెల్లిస్తుండగా, నాల్గవ విడతను వచ్చే ఏడాది ఫిబ్రవరిలో చెల్లించనున్నారు.